ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్థానిక ఎన్నికలంటే భయపడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

ABN, Publish Date - Jul 18 , 2025 | 01:08 AM

స్థానిక ఎన్నికలు పెట్టాలం టే కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపడుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు.

సిరిసిల్ల, జూలై 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలు పెట్టాలం టే కాంగ్రెస్‌ ప్రభుత్వం భయపడుతోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్‌ అమలు చేయలేదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు అన్నారు. గురువా రం జిల్లా కేంద్రంలో బీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ భవనంలో సిరి సిల్ల నియోజకవర్గలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, ముస్తాబాద్‌, తంగళ్లపల్లి ముఖ్య నాయకులతో స్థానిక సంస్థల ఎ న్నికల నేపథ్యంలో మండలాల వారిగా సమావేశాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏవర్గం కూడా సంతోషంగా లేరని, ఎన్నికల ముందు కాంగ్రెసోళ్లు కూడా గెలుస్తామని అనుకోలేదని, అనుకోకుండా వచ్చిన అధికారంతో వాళ్లు ఆగం అవుతున్నారని, తమను ఆగం చేస్తున్నారన్నారు. బనకచర్ల మీటింగ్‌ అయితే ముఖ్యమంత్రి హాజరు కారని ప్రకటించిన తరువాత కొద్దిసేపటికే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బనకచర్లపై రేవంత్‌రెడ్డి అంగీకరించినట్లు ప్రకటించారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల దుకాణాల ముందు చెప్పులు పెట్టి క్యూలో నిల్చునే రోజులు మళ్లీ వచ్చాయన్నారు. వ్యవసాయంపై కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ చూపారని, నారుమళ్లు వేసే సమయానికి ఎరువులు సిద్ధం ఉండేన్నారు. కేసీఆర్‌ ఉన్నప్పుడు మానేరు వాగులో నిండుగా నీళ్ళు ఉంటే, ఇప్పుడు ఎడారిని తలపిస్తుందన్నారు. కేసీఆర్‌ కట్టిన కాళేశ్వరంలో అనేక ప్రాజెక్టులు, 15 రిజర్వాయర్లు, మూడు బ్యారేజ్‌లు, 21 పంపింగ్‌ సెట్‌లు ఉన్నాయని అన్నారు. కొండపోచమ్మ సాగర్‌ వద్ద 618 మీటర్ల ఎత్తుకు నీళ్లు కేసీఆర్‌ తెచ్చిండన్నారు. ఒక్కో మోటార్‌ 139 మెగావాట్ల బాహుబలి మోటార్లతో ఎత్తిపోతల ద్వారా నీటి సరఫరా వ్యవస్థ తయారుచేసిండని అన్నారు. 24 గంటల కరెంట్‌, రైతు బంధు, రైతు భీమతో వ్యవసాయ భూముల ధరలు పెరిగాయని, గత కాంగ్రెస్‌ హయాంలో రూ మూడు లక్షలు ఉన్న ధర, కేసీఆర్‌ నిర్ణయాలతో ఎకరానికి దాదాపు రూ.30లక్షలు అ య్యాయన్నారు. కేసీఆర్‌ ఇచ్చిన హామీలలో ఒకటికి రెండింతలు ఇస్తా మని అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, మెదక్‌లో ఓ నాయకుడు ఏకంగా 48 గంటలు కరెంటు ఇస్తామని హామీ ఇచ్చిండని అన్నారు. ప్రజలంతా కేసీఆర్‌ నాయకత్వం కోసం ఎదురుచూస్తున్నారని, ఎంపీటీసీ, జడ్పీటీసీ, స్థానాల్లో గెలవాలని, రాష్ట్రంలోని 269 జడ్పీటీసీ స్థానాల్లో గెలవబోతున్నామన్నారు. ఈ సమావేశంలో నాస్కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు,సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడూరి ప్రవీణ్‌, జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చెలిమెడ లక్ష్మీనర్సింహ రావు, జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ,సిరిసిల్ల పట్టణాధ్యక్షు డు జిందం చక్రపాణి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళ బీఆర్‌ ఎస్‌ నాయకులు బొల్లి రాంమోహన్‌, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీ పీలు, మాజీ సర్పంచ్‌లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రసాద్‌ పరామర్శించిన కేటీఆర్‌

సిరిసిల్లలో ఇటివల గుండెపోటుతో మృతిచెందిన రిపోర్టర్‌ ప్రసాద్‌ కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Updated Date - Jul 18 , 2025 | 01:08 AM