రాజన్న గోశాల నిర్వహణలో పూర్తి నిర్లక్ష్యం..
ABN, Publish Date - Jun 02 , 2025 | 12:53 AM
వేములవాడ రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు.
వేములవాడ కల్చరల్, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజన్న ఆలయ గోశాలలోని కోడెల సంరక్షణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. పట్టణలోని ఆయన నివాసం లో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ స్థానిక శాసన సభ్యుడు ఆది శ్రీనివాస్ కోడెల మృత్యువాత పడుతున్న ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించా రు. తెలంగాణలోని ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా రాజన్నకు మొక్కు లు చెల్లించుకునే ఆనవాయితీలో భాగంగా నిత్యం స్వామివారికి కోడెలు సమర్పి స్తున్నారని తెలిపారు. మరోవైపు గుడి బంద్ చేస్తారన్న ప్రచారంలో భాగంగా భక్తులు ప్రతినిత్యం వేలాదిగా తరలివస్తూ అత్యంత ప్రీతిపాత్రమైన స్వామివారికి నిజకోడెను కూడా భక్తులు సమర్పించుకుంటున్నారని తెలిపారు. ఆరు మాసాలు గా కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా, దీంతో తిప్పాపూర్ గోశాలలో కేవలం 500 కోడెలు మాత్రమే ఉంచే స్థలంలో 1200కు పైగా కోడెలను ఉంచడం ద్వారా అనారోగ్యం బారినపడి సరైన ఆహారం అందక మృత్యువాత పడుతున్నాయన్నా రు. పశువైద్యాధికారులే నిర్ధారించడం దురదృష్టకరమన్నారు. స్వామివారికి అత్యం త ప్రీతిపాత్రమైన కోడె మొక్కు ద్వారా యేటా 22 కోట్ల ఆదాయం వస్తుండగా కనీసం వాటికి ఆహారం పెట్టలేని దుస్థితిలో రాజన్న ఆలయ అధికారులు, ప్రభు త్వం ఉండడం దురదృష్టకరమన్నారు. 500 చోట 1200కు పైగా కోడెలు ఉండడం కనీస ఆహారం లేక మృతిచెందడంలో అధికారులు, నాయకులకు కనీస మానవ త్వం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన తర్వాత మాత్రమే అధి కారులు హడావిడి చేస్తూ పంపిణీకి సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ప్రకటన చేస్తున్నా రని, గతంలో జరిగిన అవకతవకలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా పకడ్బందీ గా పంపిణీ జరగాలని సూచించారు. ఇకపై రాజన్న కోడెలకు శాశ్వత పరిష్కారం గా 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి వాటిని కాపాడి భక్తుల మనోభావాలను గౌరవించాలన్నారు. ఏనుగు మనోహర్‌రెడ్డి, రామతీర్థపు రాజు తదితరులున్నారు.
Updated Date - Jun 02 , 2025 | 12:54 AM