పరిహారం... పరిహాసం...
ABN, Publish Date - May 29 , 2025 | 12:20 AM
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని రైతులు యేటా నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహా రాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేర లేదు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు.
- ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టం
- నష్టపరిహారం ఇవ్వని ప్రభుత్వం
- ఫసల్ బీమా పథకం అమలు చేయాలంటున్న రైతులు
- మూడు సీజన్లకు వర్తింపజేయని ప్రభుత్వం
ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిని రైతులు యేటా నష్టపోతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహా రాన్ని అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అయితే ఈ పథకంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేర లేదు. అనంతరం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ పథకాన్ని అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకు నేందుకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇవ్వడంలేదు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ప్రకృతి వైపరీత్యాలు, చీడ పీడల వల్ల దెబ్బతినే పంటలకు పరిహారాన్ని అందించేందుకు ఉద్ధేశించిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయక పోవడంతో రైతులు యేటా తీవ్రంగా నష్టపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నది. మూడు సీజన్లు పూర్తి కాగా, ఏ ఒక్క సీజన్‌లో కూడా ప్రభు త్వం పంటల బీమా పథకాన్ని అమలు చేయలేదు. గడిచిన సీజన్‌లో అకాల, వడగళ్ల వర్షాలకు 5,482 ఎకరాల్లో వరి, మొక్కజొన్న. మామిడి, కూరగాయల పంటలు నష్టపోయినా పరిహారం చెల్లించలేదని రైతులు పేర్కొన్నారు. ఫసల్ బీమా పథకం అమల్లో ఉంటే బీమా కంపెనీల ద్వారా పరిహారం వచ్చేదని పేర్కొంటున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో జిల్లాలో 2,72,678 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇం దులో అత్యధికంగా 2,12,500 ఎకరాల్లో వరి, 52,500 ఎకరాల్లో పత్తి, మిగతా మొక్కజొన్న. కంది, పెసర, వేరుశెనగ, బబ్బెర, ఆయిల్‌పామ్, కూరగాయలు సాగు కానున్నాయని అంచనా వేశారు.
ఫ 2016లో ఫసల్ బీమా పథకం ఆరంభం..
అతివృష్టి, అనావృష్టి, తెగుళ్లు సోకడం వల్ల పంట నష్టపోయే రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2016, ఫిబ్రవరి 18న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని ఆరంభించింది. ఈ పథకం కింద ప్రీమియం డబ్బులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లిస్తుంటాయి. రైతు వాటా కింద వానాకాలం సీజ న్‌లో పంట మొత్తంలో 2 శాతం, యాసంగి సీజన్‌లో 1.5 శాతం ప్రీమియంను బీమా కంపెనీలకు చెల్లిం చాల్సి ఉంటుంది. పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షించాల్సి ఉంటుంది. బీమా కంపెనీలను టెండర్ల ద్వారా ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆహార పంటలతో పాటు వాణిజ్య పంటలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తుం టారు. రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని వానా కాలంలో 5 పంటలు వరి, పత్తి, కంది, మొక్కజొన్న, వేరుశెనగ పంటలకు, యాసంగిలో ఆరు పంటలు వరి, పప్పుదినుసులు, మొక్కజొన్న. వేరుశెనగ, మినుములు, జొన్న పంటలకు వర్తింప జేశారు.
2020 నుంచి ఫసల్ బీమా పథకం నుంచి అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం తప్పుకున్నది. ఈ పథకంలో పలు చేర్పులు, మార్పులు చేయాలని సూచించింది. రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకునే సమయంలో ఆ రుణం నుంచే బ్యాంకర్లు రైతు చెల్లించే బీమా ప్రీమి యం మొత్తాన్ని మినహాయించుకునే విధానాన్ని ఎత్తి వేయాలని నాటి ప్రభుత్వం పేర్కొంది. పంటల బీమా పథకంలో చేరడం, చేరకపోవడం అనేది రైతు ఇష్టంగా ఉండాలని పేర్కొంది. ఆ తర్వాత నుంచి కేంద్ర ప్రభు త్వం పంటల బీమా పథకంలో పలు మార్పులు తీసుక వచ్చింది. బీమా చేయడం నిర్బంధం కాకుండా, రైతు లకు ఇష్టం ఉంటేనే చేరే విధంగా నిబంధనలను మార్చారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆ పథకంలో చేరలేదు. దీంతో రైతులు నేరుగా పంటల బీమా పథ కంలో చేరితే 60 శాతం ప్రీమియం చెల్లించాల్సి రావ డంతో అది భారంగా భావించిన రైతులు ఆ పథకంలో చేరలేదు. నాటి ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నుంచి చేతులెత్తేయడంతో ప్రకృతి వైపరీత్యాల వల్ల చాలా వరకు నష్టపోయారు.
ఫ గతేడాది నుంచే అమలు చేస్తామన్న ప్రభుత్వం
అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఫసల్ బీమా పథకాన్ని గతేడాది వానాకాలం సీజన్ నుంచి అమలు చేస్తామని, రైతుల మీద భారం వేయకుండా బీమా ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుం దని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సీజన్‌లో పంటల బీమా పథకాన్ని అమలు చేయకపోగా, గడిచిన యాసంగి సీజన్‌లోనైనా అమలు చేస్తుందని రైతులు చూశారు. కానీ ఆ సీజన్‌లో కూడా అమలు చేయలేదు. దీంతో రెండు పర్యాయాలు కురిసిన అకాల, వడగళ్ల వర్షాలకు పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, ఓదెల, కాల్వశ్రీ రాంపూర్, ముత్తారం, తదితర మండలాల్లో 5,482 ఎకరాల్లో వరి, మొక్కజొన్న. మామిడి, కూరగాయల పంటలకు నష్టం వాటిల్లింది. వ్యవసాయ శాఖాధికా రులు పంట నష్టాన్ని అంచనా వేసి పరిహారం కోసం ప్రభుత్వానికి నివేదిక పంపించారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తామని ప్రకటించినా ఇవ్వలేదు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వా లని వినతిపత్రం ఇచ్చినా పరిహారం విడుదల కాలేదని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ వానాకాలం సీజన్ నుంచైనా ఫసల్ బీమా పథ కాన్ని అమలు చేయాలని రైతులు కోరుతున్నారు.
Updated Date - May 30 , 2025 | 03:08 PM