కమాండ్ కంట్రోల్ రూం పనులు పూర్తి చేయాలి
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:54 AM
కమాండ్ కంట్రోల్ రూం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ తీగల వంతెన సమీపంలో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనులను బుధవారం ఆమె పరిశీలించారు.
- కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ క్రైం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కమాండ్ కంట్రోల్ రూం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కరీంనగర్ తీగల వంతెన సమీపంలో నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ రూం పనులను బుధవారం ఆమె పరిశీలించారు. పనులు 90 శాతం మేర పూర్తయ్యాయని తెలిపారు. భవనంలో అన్ని వసతులు, అధునాతన సౌకర్యాలు సమకూర్చాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ రూమ్‌ను నగరపాలక సంస్థ కార్యాలయంలోని చివరి అంతస్తులో నిర్వహిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఉన్న సుమారు 350 సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్‌ను ఇక్కడి నుంచే పర్యవేక్షిస్తున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, ఆర్డీవో మహేశ్వర్, మున్సిపల్ డివిజనల్ ఇంజనీర్లు లచ్చిరెడ్డి, అయూబ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యాదగిరి పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:55 AM