గ్రామపాలన అధికారుల నియామక పరీక్షను పరిశీలించిన కలెక్టర్
ABN, Publish Date - May 26 , 2025 | 12:45 AM
నగరంలోని సప్తగిరికాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామపాలన అధికారుల(జీపీవో) నియామక పరీక్షను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం పరిశీలించారు.
కరీంనగర్ టౌన్, మే 25 (ఆంధ్రజ్యోతి): నగరంలోని సప్తగిరికాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన గ్రామపాలన అధికారుల(జీపీవో) నియామక పరీక్షను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదివారం పరిశీలించారు. గత ప్రభుత్వం రద్దు చేసిన వీఆర్‌వో, వీఆర్‌ఏలను తిరిగి రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు గ్రామాల్లో రెవెన్యూ సేవల పున రుద్ధరణ కోసం గ్రామపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు జీపీవో పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వీఆర్‌వో, వీఆర్‌ఏలకు పరీక్ష నిర్వహించారు. 189 మంది వీఆర్‌వో, వీఆర్‌ఏలు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోగా 172 మంది పరీక్షకు హాజరయ్యారు. రాత పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి ఏర్పా ట్లను పరిశీలించారు. అభ్యర్థుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, డీఆర్‌వో పవన్‌కుమార్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్, నెహ్రూ యువకేంద్ర కో-ఆర్డినేటర్ రాంబాబు, డీవైఎస్‌వో శ్రీనివాస్, ఏవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 26 , 2025 | 12:45 AM