ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో సీఎం ఫొటో పెట్టితీరాలి

ABN, Publish Date - May 28 , 2025 | 12:38 AM

సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి తీరాల్సిందేనని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

వేములవాడ టౌన్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంప్‌ ఆఫీసులో సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టి తీరాల్సిందేనని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. వేములవాడ మండలం అగ్రహారం గ్రామంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో అర్బన్‌ మండలానికి చెందిన 371మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు పట్టాలను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ఝాతో కలిసి అందజేశా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావే శంలో ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిరిసిల్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటీఆర్‌ సొంత ఆఫీసు కాదని, ఆయన ఇందులో శాశ్వతంగా ఉండరని ఎద్దే వా చేశారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే వారికి అధికారికంగా కేటాయించే క్యాంప్‌ ఆఫీస్‌ అని అన్నారు. ప్రతి నియోజకవర్గం కేంద్రంలో ప్రభుత్వం క్యాంపు ఆఫీస్‌లు నిర్మాణం చేసిందని, అది ప్రభుత్వ ఆఫీస్‌ అని, ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పకుండా సీఎం ఫొటో పెట్టాల్సి ఉంటుందని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డి ఫొటో పెట్టడానికి కేటీఆర్‌కు ఎందుకు అంత నామోషీని ప్రశ్నించా రు. సీఎం ఫొటో ఉండాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడగడంలో తప్పు లేదని, కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నిస్తే సహించలేక బీఆర్‌ఎస్‌ నాయ కులే దౌర్జన్యానికి దిగారన్నారు. ఎన్నికల హామీల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఊరు ఊరుకు పండగల అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజు, వైస్‌చైర్మన్‌ కనికరపు రాకేష్‌, కాం గ్రెస్‌ మండల అధ్యక్షుడు పిల్లి కనుకయ్య తదితరులు ఉన్నారు.

అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు

వేములవాడ రూరల్‌, మే 27(ఆంధ్రజ్యోతి) : అర్హులకు మాత్ర మే ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్‌ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. చెక్కపల్లిలో అర్హులైన 333 మంది లబ్ధిదారులకు కలెక్టర్‌ సందీన్‌ కుమార్‌ ఝాతో కలిసి ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రా లను అందజేశారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభు త్వం అందించే ప్రతిఫలాలకు ఎవ్వరిని ఆశ్రయించాల్సిన అవసరం లేదని దళారులకు గానీ ఇతరులకు డబ్బులు ఇచ్చి పైరవీలు చే యాల్సిన అవసరంలేదన్నారు. అర్హులందరికి ఇందిరమ్మ ఇళ్లు మం జూరు చేస్తామన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుకను ఉచితంగా ఇస్తామని, 30 రోజుల్లో లబ్ధి దారులు ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభించకుంటే రద్దయ్యే అవ కాశం ఉందన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ రొండి రాజు, పీడీ హౌసింగ్‌ శంకర్‌, మండల ప్రత్యేక అధికారి లక్ష్మీరాజం, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:38 AM