రాజన్న ఆలయాన్ని మూసివేయడం.. భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే..
ABN, Publish Date - May 09 , 2025 | 12:10 AM
అభివృద్ది పేరుతో ఆలయాన్ని మూసి వేసి అభివృద్ది చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు.
వేములవాడ టౌన్, మే 8 (ఆంధ్రజ్యోతి): అభివృద్ది పేరుతో ఆలయాన్ని మూసి వేసి అభివృద్ది చేయడం భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనని వేములవాడ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు అన్నారు. పట్ట ణంలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ది నివేదికలపై రహస్యం ఎందుకని ప్రశ్నించారు. రాజన్న ఆలయ నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని, ఆలయాన్ని మూసివేస్తే చిరు వ్యాపారులు తీవ్ర మనోవేదనకు గురువుతన్నారని అన్నారు. రోడ్డు విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరిస్తారు తెలియజేయాలన్నారు. ఆగమశాస్త్రం వారి సలహాలతో ప్లాన్ చేయాలని సూచిస్తు న్నామని అన్నారు. ఆగమశాస్త్ర నిపుణుడిని, స్థపతిని నియమించారా అని ప్రశ్నిం చారు. డబ్బులు రాజన్న ఆలయ డిపాజిట్ నుంచి తీస్తున్నారా.. ప్రభుత్వం నుంచి వస్తున్నాయా వివరించాలని అన్నారు. డబ్బులు సరిపోక మధ్యలో అభివృద్ధి పను లు నిలిపివేస్తే భక్తుల పరిస్థితి ఏమిటని అని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట తర హాలో ప్రణాళికలను రచించి ఆర్కిటెక్ట్ నియమించి 5 సంవత్సరాలలో పనులు పూర్తి చేశారని, మీరు రాజన్న ఆలయాభివృద్ధిని ఎలా చేస్తారో తెలియజేయాలని అన్నారు. గాజులు అమ్ముకునే మహిళలు, పూలు పండ్లు, ఆటో కార్మికులు, చిరు వ్యాపారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ సమావేశంలో రాఘవరెడ్డి, రామతీ ర్థపు రాజు, క్రాంతికుమార్, రామ్మెహన్, సిరిగిరి చందు, గోలలి మహేష్, జోగిని శంకర్, నరాల దేవేందర్, శ్రీకాంత్‌గౌడ్, మల్లేశం, తదితరులు ఉన్నారు.
Updated Date - May 09 , 2025 | 12:11 AM