గురుకుల పాఠశాలల్లో పరిశుభ్రత పాటించాలి
ABN, Publish Date - Jul 04 , 2025 | 12:54 AM
గురుకుల పాఠశా ల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాత్త్రగా చర్యలు చేపట్టడంతోపాటు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అదేశించారు.
సిరిసిల్ల రూరల్, జూలై 3 (ఆంధ్రజ్యోతి) : గురుకుల పాఠశా ల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాత్త్రగా చర్యలు చేపట్టడంతోపాటు పరిసరాలను నిత్యం పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అదేశించారు. సిరిసిల్ల అర్భన్ పరి ధిలోని చిన్నబోనాల సాంఘిక సంక్షేమ గురుకులం, పెద్దూర్‌లోని మహాత్మాజ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలతో పాటు సిరిసిల్ల పట్టణంలోని మహాత్మాజ్యోతిబాఫూలే బాలికల వసతిగృహం, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మైనార్టీ బాలికల వసతిగృహం, బద్దెనపల్లి, నేరేళ్ల బాలికల రెసిడెన్షియల్ విద్యాలయాలను గురు వారం సాయంత్రం కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా తనిఖీలు చేప ట్టారు. ఆయా పాఠశాలలు, వసతి గృహాల పరిసరాలు, వంట గదులు, నిలువ చేసిన ఆహార పదార్థాలు, పళ్లను పరిశీలించారు. మండెపల్లిలోని మైనార్టీ బాలుర వసతిగృహాంలో సౌకర్యాలు సరిపడా లేకపోవడంతో వారిని కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన గత భవనాన్ని వినియోగించాలని సూచించారు. పెద్దూర్, మండెపల్లిలోని ఆర్‌వో ప్లాంట్‌లను రెండు రోజుల్లో వినియోగంలోకి తీసుకరావాలని ఆదేశించారు. తాజా నాణ్యమైన కూరగాయలు, పళ్లు నిత్యం అందుబా టులో ఉంచాలని అధికారుకుల సూచించారు. మోనూ ప్రకారం విద్యా ర్థులకు ఆహార పదార్థాలు వడ్డించాలని సూచించారు. హాస్టల్ ఆవర ణంతోపాటు వంట గదులు ఖచ్చితంగా శుభ్రంగా ఉంచాలని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిసరాల పరిశు భ్రత కోసం మున్సిపల్, గ్రామపంచాయతీ అధికారులతో పనులు చేయించుకోవాలన్నారు. పాఠశాలల్లో సంక్షేమ వసతి గృహాల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజులు అందిస్తున్న భోజనంపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సామాగ్రి అవసరం ఉంటే తన దృష్టికి తీసుకరావాలని సూచించారు. మహిళా సంక్షేమ వసతిగృహాల్లో అందరు మహిళా సిబ్బంది ఉండా లని, అలాగే మిగతా వసతి గృహాల్లో పనిచేసే సిబ్బంది స్థానికంగానే నివాసం ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్, డీపీఆర్‌వో శ్రీధ ర్‌వంగరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 04 , 2025 | 12:54 AM