రైల్వేస్టేషన్‌లో డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు
ABN, Publish Date - Jun 24 , 2025 | 11:36 PM
: మాదకద్రవ్యాలైన గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకాలు, సేవించడం నియంత్రించేందుకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలైన గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా, అమ్మకాలు, సేవించడం నియంత్రించేందుకు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం డాగ్‌స్క్వాడ్‌తో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌తోపాటు కేఫ్, తీగలగుట్టపల్లిలోని ముఖ్య కూడలి, బొమ్మకల్‌లోని టీ షాపు, కేఫ్, ఇతర ప్రాంతాల్లో గంజాయి, డ్రగ్స్‌పై ప్రత్యేక శిక్షణ పొందిన డాగ్‌తో తనిఖీలు చేశారు. కొందరు అనుమానితులను ప్రశ్నించి వదిలిపెట్టారు. తనిఖీల్లో ఎస్‌ఐ ఎ లక్ష్మారెడ్డి, అగస్తభార్గవ్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Jun 24 , 2025 | 11:36 PM