ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధిహామీ పనుల్లో అక్రమాలకు చెక్‌

ABN, Publish Date - May 17 , 2025 | 01:14 AM

ఉపాధిహామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్థాయిలో విజిలెన్స్‌ మాని టరింగ్‌ కమిటీలను నియమిస్తున్నారు. జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.

- విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీలతో నిఘా

- ప్రతీ శుక్రవారం రోజ్‌గార్‌ దివస్‌ పేరిట సమావేశాలు

- జిల్లాలో పూర్తి కావస్తున్న కమిటీల నియామకాలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

ఉపాధిహామీ పథకం పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలను నిరోధించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది. ఉపాధిహామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గ్రామస్థాయిలో విజిలెన్స్‌ మాని టరింగ్‌ కమిటీలను నియమిస్తున్నారు. జిల్లాలో 266 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. డిజిటల్‌ ట్రాకింగ్‌. రియల్‌ టైం రిపోర్టింగ్‌ ద్వారా ఉపాధిహామీ పథకాన్ని బలోపేతం చేయడంతోపాటు పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు కమిటీలను వేస్తున్నారు. గతం లోనూ ఈ కమిటీలు ఉన్నప్పటికీ, నామ్‌కే వాస్తేగా పని చేశాయి. కమిటీలు పకడ్బందీగా పని చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.

గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలు, ఇతరులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఉండేందుకు 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని తీసుక వచ్చింది. ఈ పథకం ద్వారా యేటా జాబ్‌ కార్డులు కలిగిన కుటుంబాలకు 100 పని దినాలు కల్పించాలని లక్ష్యం విధించారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వమే నిధులను కేటాయిస్తోంది. కేటాయించిన నిధుల్లో 60 శాతం నిధులను కూలీలకు, 40 శాతం నిధులను మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు వెచ్చించాలని చట్టంలో పేర్కొన్నారు. ఏడాదికి సరిపడా ఉపాధి పను లను గుర్తించేందుకు యేటా నవంబర్‌, డిసెంబర్‌లో పనులను గుర్తిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కేటాయించే పని దినాలు, బడ్జెట్‌ను, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు కేటాయిస్తుంది. జిల్లాలో 1.19 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులను జారీ చేయగా, వీటిలో 2.44 లక్షల మంది కూలీలు ఉన్నారు.

పెద్దపల్లి జిల్లాకు యేటా 20 నుంచి 27 లక్షల వరకు పని దినాలను లక్ష్యంగా విధిస్తున్నది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 13.99 లక్షల పని దినాలను మాత్రమే కేటాయించింది. ఉపాధి పనులు పారదర్శకంగా జరిగేలా విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీలు పర్యవేక్షించనున్నాయి.

ఫ విజిలెన్స్‌ కమిటీలు నిర్వహించే విధులు..

ప్రతీ గ్రామంలో ఐదుగురు సభ్యులతో కూడిన విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీలను ఏర్పాటు చేస్తు న్నారు. ఈ కమిటీలో స్వయం సహాయక సంఘాల మహిళలతోపాటు ఎస్సీ, ఎస్టీలు ఉండే విధంగా కార్యాచరణ రూపొందించారు. అంగన్‌వాడీ టీచర్లు, ఉపాధ్యాయులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈ కమిటీని ఎంపిక చేసి జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు ప్రతిపాదిస్తారు. తద్వారా కలెక్టర్‌కు, అక్కడి నుంచి రాష్ట్ర అధికారులకు నివేదికలు పంపుతారు. రాష్ట్ర అధికారుల ఆమోదంతో ఈ కమిటీలు రంగంలోకి దిగనున్నాయి. విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీ వారానికి ఒకసారి పని చేసే ప్రదేశానికి వెళ్లి పరిశీలించాల్సి ఉంటుంది. ప్రతీ శుక్ర వారం ఉపాఽధిహామీ సిబ్బంది, కూలీలతో రోజ్‌గార్‌ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇందులో చేసిన పనుల కొలత, కూలీలకు డబ్బుల చెల్లింపు, పనుల నాణ్యత, కూలీల సమస్యల గురించి మాట్లాడ నున్నారు. అలాగే వ్యయం, సంబంధిత రికార్డులను తనిఖీ చేయాల్సి ఉంటుంది. సామాజిక తనిఖీ జరిగే సమయంలో విజిలెన్స్‌ కమిటీ రూపొందించిన నివేదిక లను అధికారులకు అందజేయనున్నారు. అందులో అక్రమాలు జరిగినట్లు తేలితే అందుకు బాధ్యులైన వారిపై అధికారులు చర్యలు తీసుకోనున్నారు. జిల్లాలో ఈ కమిటీల నియామకాలు పూర్తి కావస్తున్నాయి.

ఫ విజిలెన్స్‌ కమిటీలతో పనుల్లో పారదర్శకత

- కాళిందిని, డీఆర్‌డీవో, పెద్దపల్లి

గ్రామస్థాయిలో విజిలెన్స్‌ మానిటరింగ్‌ కమిటీల ఏర్పాటుతో ఆయా గ్రామాల్లో జరిగే ఉపాధిహామీ పథకం పనుల్లో మరింత పారదర్శకత పెరగనున్నది. గతంలో గ్రామాల్లో వర్క్స్‌ కమిటీలు ఉండేవి. వాటినే విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీల పేరుతో పంచాయ తీల్లో ఏర్పాటు చేస్తున్నాం. జిల్లాలో కమిటీల ఏర్పాటు పూర్తి కావస్తున్నాయి. ఈ కమిటీలు ప్రతీ శుక్రవారం రోజ్‌గార్‌ దివస్‌ నిర్వహించి ఉపాధి కూలీల సమ స్యలను పరిష్కరించడంతోపాటు పనుల గురించి చర్చించనున్నారు.

Updated Date - May 17 , 2025 | 01:14 AM