బో ‘నమో’ గంగమ్మ
ABN, Publish Date - Aug 04 , 2025 | 12:38 AM
శ్రావణమాసం సందర్భంగా బైపాస్‌రోడ్ మానేరు నదిలోని గంగామాత ఆలయంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర కులస్థులు ఇంటికో బోనం చొప్పున వివిధ ప్రాంతాల నుంచి డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, భక్తి పారవశ్యంతో తరలి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం, వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం సందర్భంగా బైపాస్‌రోడ్ మానేరు నదిలోని గంగామాత ఆలయంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మతల్లి బోనాల జాతరను ఆదివారం ఘనంగా నిర్వహించారు. గంగపుత్ర కులస్థులు ఇంటికో బోనం చొప్పున వివిధ ప్రాంతాల నుంచి డప్పు చప్పుళ్ళు, నృత్యాలు, భక్తి పారవశ్యంతో తరలి వచ్చి అమ్మవారికి ఒడిబియ్యం, వస్త్రాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం నగర అధ్యక్ష, కార్యదర్శులు పెద్దపల్లి జితేందర్, నాగుల రాజారాం, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మోసం అంజయ్య, గడప కోటేశ్, మాజీ అధ్యక్షుడు పర్రె రాజేశం, పెద్దపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ మర్రి భావన సతీశ్, పెద్దపల్లి రవీందర్, గడప లక్ష్మీనారాయణ, సందిరి నరహరి, వివిధ డివిజన్‌ల అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు.
Updated Date - Aug 04 , 2025 | 12:38 AM