ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపి దేశ దిశ..దశను మార్చింది

ABN, Publish Date - Jun 16 , 2025 | 12:34 AM

వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలోనే భారత దేశ దిశదశ మార్చిందని బీజేపి రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ పుప్పాల రఘు అన్నారు.

కరీంనగర్‌ రూరల్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా మోదీ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన 11 ఏళ్లలోనే భారత దేశ దిశదశ మార్చిందని బీజేపి రాష్ట్ర కౌన్సిల్‌ మెంబర్‌ పుప్పాల రఘు అన్నారు. కరీంనగర్‌ రూరల్‌ మండలం నగునూర్‌ గ్రామంలో నిర్వహించిన మండల సంకల్ప సభలో ఆయన మాట్లాడారు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం భారత వైభవాన్ని విశ్వ వేదికపై నిలబెట్టిందన్నారు. సేవ, సుపరిపాలన, పేదల సంసక్షేమమే లక్ష్యంగా, వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి అనుగుణంగా ప్రధాని మోదీ పరిపాలన విజయవంతంగా కొనసాగుతుందన్నారు. జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌తో నాయకత్వం అంటే ఏమిటో దేశానికి, ప్రపంచానికి ప్రధాని మోదీ చూపించారన్నారు. ప్రజా ఆశీస్సులతో తెలంగాణలో రాబోయేది బీజేపి ప్రభుత్వమేనని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రజలందరినీ కాంగ్రెస్‌ మోసం చేసిందని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పని అయిపోయిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ అవుడేటెడ్‌ పార్టీ అని తెలంగాణలో ఈ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించరన్నారు. కార్యక్రమంలో గాండ్ల గోపాల్‌, దూడం రమేష్‌, కూకట్ల రమేష్‌, దూడం శ్రీనివాస్‌, గుర్రం కమలాకర్‌రెడ్డి, ఎండీ అఫ్రోజ్‌, శివారెడ్డి, దీపక్‌, తేజ, సృజన్‌, సునీల్‌, శ్రీనివాస్‌, దేవేందర్‌, రమేష్‌, సంజీవ్‌, అమరేందర్‌, మాధవ్‌, రాజు, మహేష్‌ నగేష్‌, ప్రదీప్‌ రెడ్డి, శ్రీనివాస్‌, మారుతి, వికాస్‌, వినయ్‌, అజయ్‌, సచిన్‌, సంజయ్‌,అభిలాష్‌, అనిల్‌, వెంకటేష్‌, క్రమ్‌, విజయ్‌, మల్లేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 12:34 AM