ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూభారతి చట్టం రైతులకు మేలు

ABN, Publish Date - Apr 28 , 2025 | 11:18 PM

రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌ సత్పతి పమేలా అన్నారు. సోమవారం వీణవంక మండలం చల్లూరు రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

చల్లూరు రైతు వేదికలో భూ భారతి సమావేశంలో మాట్లాడుతూన్న కలెక్టర్‌ సత్పతి పమేలా

వీణవంక, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకు వచ్చిన భూభారతి ఆర్వోఆర్‌ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని కలెక్టర్‌ సత్పతి పమేలా అన్నారు. సోమవారం వీణవంక మండలం చల్లూరు రైతు వేదికలో భూభారతి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నూతన చట్టంలో క్షేత్ర స్థాయిలో సర్వే చేసి విచారణ జరిపిన తర్వాతే రిజిస్టేషన్లు, మ్యూటేషన్లు చేయనున్నట్లు తెలిపారు. ధరణిలో పరిష్కారం కాని సాదాబైనామా దరఖాస్తులు నూతన చట్టంతో పరిష్కారమవుతాయన్నారు. రైతుల భూ సమస్యలకు తహసీల్దార్‌ వద్ద న్యాయం జరుగకుంటే ఆర్డీవో వద్దకు, అక్కడ సంతృప్తి చేందకుంటే భూమి ట్రిబ్యునల్‌ వద్దకు వెళ్లి అప్పిల్‌ చేసుకోవచని తెలిపారు. ధరణిలో ఉన్న అనేక మ్యాడ్యుల్స్‌తో రైతులు ఇబ్బంది పడ్డారని, నూతన చట్టం ప్రకారం భూమి సవరణ కోసం దరఖాస్తు చేసుకుంటే 60 రోజుల్లో సమస్య పరిష్కారిస్తారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో రమేష్‌ బాబు, ఏడీఏ సునీత, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో శ్రీధర్‌,సింగిల్‌ విండో చైర్మన్‌ మావురపు విజయ భాస్కర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ గాజుల మేరి శ్యాంసన్‌ పాల్గొన్నారు.

ఫ ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపికను వేగవంతం చేయాలి.

మానకొండూర్‌: ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అఽధికారులకు సూచించారు. మానకొండూర్‌లో జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్లసర్వేను సోమవారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరుగుకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వచ్చిన దరఖాస్తుల్లో అత్యంత నిరుపేదలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ఇందిరమ్మ కమిటీలతో సమావేశం నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్‌ రాజేశ్వరి, ఎంపీడీవో వరలక్ష్మి, పంచాయితీ కార్యదర్శి రేవంత్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Apr 28 , 2025 | 11:18 PM