ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ భారతి చట్టం దేశానికి ఆదర్శం..

ABN, Publish Date - May 17 , 2025 | 12:34 AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

రుద్రంగి, మే 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూపొం దించిన భూభారతి చట్టం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రుద్రంగి మండలం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన భూభారతి చట్టం-2025పై నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పంచాయ తీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ(సీతక్క) రవాణా, బీసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, సీసీఎల్‌ఏ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌లతో కలిసి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ పెద్దలు స్వార్థపూరితంగా నాలుగు గోడల మధ్య ఎవరి అభిప్రాయాలు తెలుసుకో కుండా ధరణి చట్టం తయారు చేసిందని అన్నారు. ప్రజా ప్రభుత్వం దేశంలోనే 18 రాష్ట్రాల్లోనే 20 చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని వారి కోరిక మేరకు భూ భారతి చట్టం తయారు చేశామన్నారు. రాష్ట్రంలోనే ప్రతి రైతుకు భరోసా భద్రత కల్పించా లని మేధావులతో చర్చించి పేదలకు మంచి జరగాలనే తపనతో భూ భార తి చట్టాన్ని రూపొందించామని తెలిపారు. భవిష్యత్తులో ఏ రాష్ట్రంలో రెవె న్యూ చట్టం తయారుచేయాలన్న ఆదర్శంగా ఉండే విధంగా భూ భారతి చట్టం ప్రజా ప్రభుత్వం తయారుచేసిందని, దేశానికి ఆదర్శంగా భూ భారతి చట్టం నిలుస్తుందన్నారు. పెండింగ్‌ ఉన్న సాదాబైనామా చట్టం సమస్యలకు భూ భారతి ద్వారా పరిష్కారం లభిస్తుందన్నారు. గత ప్రభు త్వం సాదాబైనమా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ ధరణి చట్టంలో సాదా బైనమా గురించి అసలు పెట్టలేదన్నారు. భూ సరిహద్దులతోపాటు భూమి కొలతలు పూర్తిగా ఉండే విధంగా రిజిస్ట్రేషన్‌ వ్యవస్థలో మార్పులు తీసుకొ ని వచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాలలో 6 వేల లైసెన్స్‌ ప్రైవేట్‌ సర్వేయర్లను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చి, మ్యాప్‌ పై సర్వే సంతకంతో కంప్యూటర్‌లో అప్‌లోడ్‌ చేస్తేనే రిజిస్ట్రేషన్‌, మ్యూటేషన్‌ జరిగేలా వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. రాబోయేరోజులలో ప్రభుత్వం మరో వెయ్యి మంది సర్వేయర్లను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గత ప్ర భుత్వం రెవెన్యూ వ్యవస్థను, వీఆర్‌ఏ, వీఆర్‌ఓ వ్యవస్థను పూర్తిగా కుప్పకూ ల్చారని, ప్రజా ప్రభుత్వంలో గ్రామానికి ఒక రెవెన్యూ అధికారుల్ని నియ మించి, అర్హులైన వారిని మళ్లీ తీసుకువచ్చి గ్రామాలలో ఎటువంటి భూ సమస్య ఉన్న అక్కడే పరిష్కారం చూపిస్తామన్నారు. తమ భూములు ధరణి వల్ల ఇంకా తమ పేరిట నమోదు కాలేదని అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. ధరణి చట్టం వల్ల ప్రజలు అధికారుల వద్దకు వెళ్లాల్సి ఉండేదని, కానీ భూ భారతి చట్టం వల్ల ప్రజల వద్దకే అధికారులు వారివారి గ్రామాలకు వచ్చి రూపాయి తీసుకోకుండా భూ సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి తెలిపారు. అసైన్డ్‌ భూములకు కూడా హక్కులు కల్పిస్తామని, పేదలకు భూములు పంచాలని ఆలోచన తమ ప్రజా ప్రభు త్వానిది అన్నారు. కోర్టులో లేని ప్రతి భూ సమస్య పరిష్కరించడమే భూ భారతి ముఖ్య ఉద్దేశం అన్నారు. ఎవరి పేరుతో ఎంత భూమి ఉందో అది వారికే చెందేలా చూస్తామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌ సమావేశం నిర్వహించి భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారని, మొదటగా నాలుగు మండలాల పైలెట్‌ ప్రాజెక్టు కింద తీసుకున్నామని, జూన్‌ రెండు లోపు ఎంపిక చేసిన నాలుగు పైలెట్‌ గ్రామాల భూ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. భూహక్కుల ఉన్న రైత ులకు న్యాయం జరిగేలా తహసీల్దార్‌ నుంచి సీసీఎల్‌ఏ వరకు 5 అంచెల వ్యవస్థ ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. అర్హులందరికీ త్వరలోనే రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే 4సంవత్సరాలలో 20లక్షల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామని అన్నారు. కార్పొరేట్‌ స్థాయిలో విద్యా అందించేందుకు సమీకృత గురుకులాలను నిర్మిస్తున్నామన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభా కర్‌ మాట్లాడుతూ భూసమస్యల రైతులు తహసీల్దార్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారని, వాటి పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం భూ భారతి చట్టం ప్రవేశపెట్టిందన్నారు. మనిషికి ఆధార్‌ కార్డు ఉన్నట్లు, భూమి భూదార్‌ కార్డు ఏర్పాటుచేసే దిశగా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. ప్రజలకు భూ హక్కులపై భరోసా కల్పించేలా చర్యలు తీసు కుంటామన్నారు. రాబోయే 2,3 రోజులలో వేములవాడ నుంచి ముంబై ప్రత్యేక ఏసీ బస్సు వేస్తామని మంత్రి తెలిపారు. రుద్రంగి బస్‌ స్టాండ్‌ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ భూ పోరాటాల చరి త్ర కలిగిన రుద్రంగి మండలకేంద్రంలో జరుగుతున్న భూ భారతి అవగా హన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వం తీసుకొని వచ్చిన ధరణి చట్టం వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయన్నారు. మహిళా సంఘాలను సీఎం రేవంత్‌ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, స్కూల్‌ యూనిఫాం దగ్గర నుంచి ఆర్టీసీ అద్దె బస్సుల వరకు, రైస్‌ మిల్లుల ఏర్పాటు, ఇందిరా మహిళ క్యాంటీన్‌, వివిధ రకాల వ్యాపార యూనిట్ల స్థాపనకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం మేరకు భూభారతి చట్టం ప్రవేశపెట్టి భూసమస్యల పరిష్కారానికి ప్రయ త్నిస్తున్నారన్నారు. రుద్రంగి నుంచి కుక్కల గండి తండా వరకు బిటి రోడ్డు మంజూరు చేయాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. రుద్రంగి, భీమారం మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, వేములవాడ నియోజకవర్గంలో సబ్‌రిజిస్టర్‌ కార్యాలయాన్ని నిర్మించాలని మంత్రి దృష్టికి విప్‌ తీసుకెళ్లారు. కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా మాట్లాడుతూ భూ భారతి చట్టంపై సందేహాల నివృత్తి కోసం మండల కేంద్రాల్లో అవగాహన సమా వేశాలు నిర్వహించామన్నారు. అనంతరం రుద్రంగి గ్రామ పంచాయతీ కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన భూ భారతి హెల్ప్‌ డెస్క్‌ను పరిశీలించారు. రుద్రంగిలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేషన్‌ యూనియాన్‌ లిమిటేడ్‌ చైర్మన్‌ మానాల మోహన్‌రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణగౌడ్‌, ఆర్డీవో రాదాభాయి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, మాజి సర్పంచ్‌ తర్రె ప్రభలత మనోహర్‌, మాజీ జడ్పీటీసీ గట్ల మీనయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, తూం జలపతి, గండి నారాయణ, కెసిరెడ్డి నర్సారెడ్డి, మాడి శెట్టి అభిలాష్‌, తర్రె లింగం, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2025 | 12:34 AM