ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతులు..

ABN, Publish Date - Jul 20 , 2025 | 01:01 AM

ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగు అయ్యాయని జిల్లా విద్యాధికారి వినోద్‌ పేర్కొన్నారు.

ఇల్లంతకుంట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలో వసతులు మెరుగు అయ్యాయని జిల్లా విద్యాధికారి వినోద్‌ పేర్కొన్నారు. మండలంలోని దాచారం గ్రామంలోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను శనివారం పరిశీలించారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా ఒక ఉపాధ్యాయుడికి డిప్యూటేషన్‌పై పంపడం పట్ల ఫిర్యాదు చేయడం జరిగింది. విద్యాధికారి పాఠశాలకు వచ్చి విద్యార్థులు ఎందరు ఉన్నారని పరిశీలించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండేలా కృషిచేస్తానన్నారు. తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం కలుగడం వల్లనే విద్యార్థుల నమోదు భారీగా పెరిగిందన్నారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టాలని సూచించారు. అనంతరం ఉన్నతపాఠశాలలో జరిగిన బోణాల సంబరాలలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీనివాస్‌గౌడ్‌, ప్రధానోపాధ్యాయులు రాణి, బాలగౌడ్‌, ఉపాధ్యాయులు నరేందర్‌రెడ్డి, శ్రీను, ఆనంద్‌, దావీద్‌, శ్రీనివాస్‌, సంజీవ్‌, శ్రావణ్‌కుమార్‌, పంచాయితీ కార్యదర్శి అంజలి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 20 , 2025 | 01:01 AM