వర్షాలు కురవాలని బతుకమ్మ ఆట
ABN, Publish Date - Jun 23 , 2025 | 12:51 AM
వర్షాలు కురియాలని వేడుకుంటూ ఆరెపల్లి గ్రామ మహిళలు బతుకమ్మ ఆట ఆడారు.
ఇల్లంతకుంట, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : వర్షాలు కురియాలని వేడుకుంటూ ఆరెపల్లి గ్రామ మహిళలు బతుకమ్మ ఆట ఆడారు. విత్తనాలు పెట్టి పక్షం రోజులు గడిచిపోయినా వర్షాలు లేకపోవడంతో మొలకెత్తడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామకూడళిలో ఆదివారం నీటితో నిండిన బిందెలను ఉంచి పాటలు పాడుతు బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు..
ఎల్లారెడ్డిపేట, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు రాచర్లగొల్లపల్లి, రాచర్లబొప్పాపూర్, రాజన్నపేట, తదితర గ్రా మాల్లో వర్షాలు కురువాలని కోరుతూ కుల సంఘాల నాయకులు ఆదివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కొలిచి మొక్కు లు చెల్లించుకున్నారు. పిల్లాపాపలు, పాడి పంటల ను చల్లగా చూడాలని వేడుకున్నారు. అనంతరం సామూహిక వన భోజనాలు చేశారు. కార్యక్రమంలో వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
గంభీరావుపేట, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గం భీరావుపేట మండల కేంద్రంతో పాటు ముస్తాఫనగ ర్‌లో వర్షాల కోసం ప్రజలు వన బోజనాలకు వెళ్లారు. వర్షాలు సమృద్దిగా కురువాలని పంటల పచ్చగా పం డాలని పిల్లాపాపలు చల్లగా ఉండాలని గ్రామ దేవ తలకు మొక్కుతూ ప్రజలు వన బోజనాలకు వెళ్ళా రు. వర్షాల కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు.
Updated Date - Jun 23 , 2025 | 12:51 AM