ఘనంగా బసవేశ్వర జయంతి
ABN, Publish Date - Apr 30 , 2025 | 11:35 PM
మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. బసవేశ్వర చిత్రపటానికి కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, డీఆర్‌వో వెంకటేశ్వర్లు పూలమాలలు వేశారు.కార్యక్రమంలో లింగాయతుల సంఘం నాయకులు, వీరశైవ మహాసభ నేతలు, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 30 , 2025 | 11:35 PM