ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా బక్రీద్‌ వేడుకలు

ABN, Publish Date - Jun 08 , 2025 | 12:34 AM

త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ వేడుకలను శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు.

సిరిసిల్ల, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్‌ వేడుకలను శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. సిరిసిల్ల సాయినగర్‌లోని ఈద్గా వద్ద ప్రార్థన లు చేశారు. అనంతరం తమ పెద్దల సమాదుల వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి నివాళులు అర్పించారు. పేదలకు దానాలను చేశారు. జిల్లా వ్యాప్తం గా ఈద్గాల వద్ద ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ సందర్భంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ఇల్లంతకుంట : బక్రీద్‌ వేడుకలు మండలంలో ఘనంగా జరిగా యి. ఇల్లంతకుంట, రేపాక, వల్లంపట్ల, గాలిపెల్లి తదితర గ్రామాలలో శనివారం ముస్లీంలు ఈద్గావద్దకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. ఇస్లాం మత విశ్వాసం ప్రకారం ఖుర్భానీ ఇచ్చారు. అనంతరం తమ పూర్వీకుల సమాధుల వద్దకు వెళ్లి వారిని స్మరించుకున్నారు. కార్యక్రమంలో మండ ల నూర్‌భాషా సంఘ అధ్యక్షుడు మహమ్మద్‌ సలావోద్దీన్‌, అసీఫ్‌రజా, నయిం, అజీం, మొబీన్‌, సాదుల్‌, మున్వర్‌, సుమేర్‌, సలావొద్దీన్‌, ఖలీల్‌, నవాబ్‌, తాజ్‌, సాదిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 08 , 2025 | 12:34 AM