ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సైబర్‌ నేరాలపై అవగాహన పెంచుకోవాలి

ABN, Publish Date - Jul 14 , 2025 | 12:45 AM

సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సిరిసేడులో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలు బాగా పెరిగాయని, ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు.

ఇల్లందకుంట మండలం సిరిసేడులో మాట్లాడుతున్న ఎస్‌ఐ క్రాంతికుమార్‌

ఇల్లందకుంట, జూలై 13 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఎస్‌ఐ క్రాంతికుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని సిరిసేడులో సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్‌ నేరాలు బాగా పెరిగాయని, ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. వాట్సప్‌లో వచ్చే లింక్‌లు ఓపెన్‌ చేయొద్దని అన్నారు. సైబర్‌ నేరాల్లో విద్యావంతులే అధికంగా మోసపోతుండడం బాధాకరమన్నారు. మల్టీలెవల్‌ మార్కెటింగ్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌, ఇతర ఆన్‌లైన్‌ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. ఏ పోలీస్‌ అధికారి నేరుగా వాట్సప్‌ వీడియోకాల్స్‌ చేయరని, డిజిటల్‌ అరెస్టులు అని ఎవరైనా కాల్స్‌ వస్తే సంబంధిత పోలీస్‌ స్టేషన్లో వెంటనే సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల బలహీనతలే సైబర్‌ నేరగాళ్లకు బలంగా మారిందన్నారు. మారుతున్న టెక్నాలజీతో మోసగాళ్లు చెలరేగిపోతున్నారన్నారు. అప్రమత్తంగా ఉంటేనే నష్టం జరగదన్నారు. సైబర్‌ నేరగాళ్ల చేతిలో నష్టపోతే తక్షణమే 1930లో ఫిర్యాదు చేయాలన్నారు. మైనర్లకు వాహనాలు నడపడానికి ఇవ్వొద్దని, ఎవరైనా తల్లిదండ్రులు ఇస్తే వాహనాలు సీజ్‌ చేసి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామన్నారు.

ఫ వీణవంక: మండలంలోని చల్లూరులో సైబర్‌ మోసలపై ఎస్‌ఐ ఆవుల తిరుపతి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అపరిచితుల మాటాలు నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో యుత్‌ సభ్యులు పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Jul 14 , 2025 | 12:45 AM