క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలి
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:04 AM
వేసవి శిక్షణ శిబిరాల్లో నేర్చుకున్న వివిధ మెళకువలతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు బుధవారం సాయంత్రం ముగిశాయి.
- సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
- ముగిసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
కరీంనగర్ స్పోర్ట్స్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): వేసవి శిక్షణ శిబిరాల్లో నేర్చుకున్న వివిధ మెళకువలతో విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా క్రీడాశాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు బుధవారం సాయంత్రం ముగిశాయి. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ వేసవిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరాల్లో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందడం అభినందనీయమన్నారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ ఈ వేసవిలో 16 క్రీడాంశాల్లో శిక్షణ శిబిరాలను నిర్వహించామన్నారు. దాదాపు 1500 మంది క్రీడాకారులు ఈ శిబిరాల్లో పాల్గొని శిక్షణ పొందారన్నారు. శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు ప్రతిరోజు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పౌష్టిక ఆహారాన్ని అందించామని తెలిపారు. జిల్లా యువజన క్రీడాశాఖ అధికారి వి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ శిబిరాల నిర్వహణలో సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా బాలభవన్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. యోగా క్రీడాకారులు చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మాజీ మేయర్లు సర్దార్ రవీందర్‌సింగ్, యాదగిరి సునీల్‌రావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, కోశాధికారి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, ఎన్‌వైకే కో ఆర్డినేటర్ రాంబాబు, ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి బి వేణుగోపాల్, పెటా టీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బాబు శ్రీనివాస్, ఆడెపు శ్రీనివాస్, టీజీ పెటా అధ్యక్షుడు అంతటి శంకరయ్య, ప్రైవేట్ పెటా అధ్యక్ష, కార్యదర్శులు గౌతమ్‌రెడ్డి, శ్రీధర్, యువజన అవార్డు గ్రహీత సత్తినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:04 AM