కోడెల పంపిణీకి ఏర్పాట్లు చేయాలి
ABN, Publish Date - Jun 09 , 2025 | 12:52 AM
వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలోని కోడెల పంపి ణీకి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సందీప్‌కు మార్ ఝా గోశాల నిర్వాహకులకు సూచించారు.
వేములవాడ కల్చరల్, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): వేముల వాడ రాజరాజేశ్వర స్వామివారి గోశాలలోని కోడెల పంపి ణీకి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సందీప్‌కు మార్ ఝా గోశాల నిర్వాహకులకు సూచించారు. తిప్పాపూ ర్ గోశాలను ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాలలో ఉన్న ఆరోగ్యవంతమైన కోడెలు స్థానిక రైతులకు ఉచితంగా సోమవారం పంపిణీ చేస్తున్నామని, కోడెల పంపిణీకి పక డ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదే శించారు. కోడెల పంపిణీ చేసే రైతులకు సంబంధించి సం పూర్ణ వివరాలు సేకరించాలని, రైతుల దగ్గరి నుంచి డిక్లరే షన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని పంపిణీ చేయా లని తెలిపారు. గోశాలలో అనారోగ్యంగా ఉన్న కోడెల ఆరో గ్య స్థితిగతులను కలెక్టర్ అడిగితెలుసుకున్నారు. అనారో గ్యంతో వున్న కోడెలకు పశువైద్య అధికారులు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. గోశాల పరిసరాలను శుభ్రం చేసి, గడ్డిని తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌క ఆదేశించారు.
Updated Date - Jun 09 , 2025 | 12:52 AM