మానసాదేవి ఆలయంలో ముగిసిన వార్షికోత్సవం
ABN, Publish Date - May 10 , 2025 | 11:32 PM
మండలంలోని ఖాసింపేట మానసాదేవి ఆలయంలో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఆలయ వార్షికోత్సవం శనివారంతో ముగిసింది.
కోనేటిలో త్రిశూలం, సుదర్శన చక్ర స్నానం నిర్వహిస్తున్న వేద పండితులు
గన్నేరువరం, మే 10 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఖాసింపేట మానసాదేవి ఆలయంలో మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన ఆలయ వార్షికోత్సవం శనివారంతో ముగిసింది. శనివారం ఆలయంలో లక్ష్మీనృసింహ వార్షిక శాంతి కళ్యాణం, ఆంజనేయస్వామికి సహస్ర కదళీ ఫల అర్చన, త్రిశూల, సుదర్శన చక్రాలకు చక్రస్నానం, పూర్ణాహుతి నిర్వహించారు. సాయంత్రం లక్ష్మీనరసింహాస్వామి ఉత్సవ విగ్రహాలతో రఽథోత్సవం నిర్వహించారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
Updated Date - May 10 , 2025 | 11:32 PM