ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:41 PM

అంగన్‌వాడీ కేంద్రంలో అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. ఇల్లందకుంటలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు.

సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ పమేల సత్పతి.

- ప్రతి మహిళ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

ఇల్లందకుంట, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రంలో అందించే సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి సూచించారు. ఇల్లందకుంటలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శుక్రవారం సభకు కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు వారానికి రెండు రోజులు మహిళలకు ఉచితంగా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తారన్నారు. ప్రతి కంతి క్యాన్సర్‌ కాదని, దానిని సకాలంలో గుర్తిస్తే మాములు కంతిగానే ఉంటుందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా షుగర్‌, బీపీ మందులు ఇస్తున్నారని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. షుగర్‌, బీపీ వ్యాధి గ్రస్థులకు తన సిబ్బంది ద్వారా నెలకు సరిపడా మందులు ఇంటికి పంపించాలని పీహెచ్‌సీ సిబ్బందికి సూచించారు. అనంతరం కలెక్టర్‌ గర్భిణులకు, చీర, సారే, చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, సీడీపీవో సుగుణ, సూపర్‌వైజర్‌ జ్యోతి, తహసీల్దార్‌ రాణి పాల్గొన్నారు.

భూ భారతితో సమస్యల పరిష్కారం

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ఇల్లందకుంట రైతు వేదికలో భూ భారతిపై రైతులకు అవగాహన సదస్సును హుజూరాబాద్‌ ఆర్డీవో రమేష్‌బాబుతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రైతులనుద్దేశించి మాట్లాడుతూ భూ భారతి ద్వారా భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు వీలుంటుందన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ రాణి, ఎంపీడీవో పుల్లయ్య, ఏవో సత్యనారాయణ, సింగిల్‌ విండో వైస్‌ చైర్మన్‌ కందాల కొంరెల్లి పాల్గొన్నారు.

జమ్మికుంటలో..

జమ్మికుంట: భూ భారతితో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం జమ్మికుంట పట్టణంలోని పాత మున్సిపల్‌ కార్యాలయంలో భూ భారతి చట్టం-2025పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆమె హజరయ్యారు. ఈ సందర్భంగ్లా కలెక్టర్‌ మట్లాడుతూ రైతులకు భూములపై భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూ భారతి చట్టాన్ని తీసుకు వచ్చిందన్నారు. భూమి కొనుగోలు, గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌, తనఖా రిజిస్ట్రేషన్‌, పట్టా మార్పు, మ్యూటేషన్లపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న, ఆర్టీవో ఎస్‌ రమేష్‌బాబు, తహసీల్దార్‌ బి రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 25 , 2025 | 11:41 PM