ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సెస్‌ చైర్మన్‌ అక్రమాలపై విచారణ జరపాలి

ABN, Publish Date - Jul 02 , 2025 | 12:39 AM

సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామరావు అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు.

సిరిసిల్ల టౌన్‌, జూలై 1 (ఆంధ్రజ్యోతి) : సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామరావు అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని సంస్థ రిటైర్డ్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో వారు మాట్లా డారు. సెస్‌ చైర్మన్‌గా చిక్కాల రామారావు 2007 నుంచి 2010 వరకు అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయన అవినీతి అక్రమాలపై ఇంకా విజిలెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారని అన్నారు. సెస్‌ నష్టంలో ఉన్నా కూడా 116సీ ప్రకారం సెస్‌ చైర్మన్‌ చిక్కాల రామారావు ప్రతి నెల రూ.లక్ష 50 వేలు జీతం తీసుకుంటున్నాడని ఆరోపించారు. చైర్మన్‌ తీసుకుంటున్నా జీతంను ఆపివేయాలని తీసుకున్న జీతం డబ్బులను రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. సెస్‌లో లైజన్‌ ఆఫీసర్‌గా ఎం రాంరెడ్డి(రిటైర్డ్‌ ఎల్‌ఐ)ని తీసుకొని చైర్మన్‌ తన సొంత పనులకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. రాంరెడ్డికి నెలకు జీతం రూ.40వేలు ఇస్తూ అందులో నుంచి చైర్మన్‌ తన ఖర్చులకు నెలకు రూ.15వేలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. 2017 నుంచి 2025 మే వరకు సెస్‌ నుంచి మొత్తం రూ. 38లక్షలు చెల్లించడం జరిగిందన్నారు. వెంటనే రాంరెడ్డిని తొలగించి తనకు చెల్లించిన మొత్తం డబ్బులను కూడా రికవరీ చేయలని డిమాండ్‌ చేశారు. ఆర్‌సీఎ అనుమతి లేనందున్న రాంరెడ్డిని వెంటనే తొలగించాలన్నారు. సిరిసిల్ల సాయినగర్‌లోని సెస్‌ స్టోర్స్‌ను పెద్దూర్‌ బైపాస్‌కి మార్చి అక్కడ కౌంపౌండ్‌, రెండు సార్లు బోర్‌ వేయడానికి ఇతర పనుల కోసం ఎలాంటి టెండర్స్‌ లేకుండా తన కమీషన్‌ కోసం అధిక బిల్లులు పెట్టి చైర్మన్‌ డబ్బులు తీసుకున్నాడని ఆరోపించారు. దీనిపై కూడా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. సెస్‌ పాలక వర్గం సమావేశంలో ఎజెం డా అంశాలపై అధ్యక్షుల అనుమతి అని రాయించి అనేక అవినీతి అక్రమాల కార్యకలాపాలకు పాల్పడ్డాడని, చైర్మన్‌ అనుమతి ఇచ్చిన తీర్మానాలపై ఆర్‌సీఎస్‌ వారితో విచారణ జరపాలని అన్నారు. ఈ సమావేశంలో సెస్‌ రిటైర్డ్‌ ఉద్యోగులు కే వీరరెడ్డి, టీ రాజేశ్వర్‌ రావు, సిహెచ్‌ వెంకటి, రామేశ్వర్‌రెడ్డి, ఇమామొద్దిన్‌, కే వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 02 , 2025 | 12:39 AM