ఇరాన్‌పై అమెరికా దాడి సిగ్గుచేటు..
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:20 AM
అణ్వాయుధాలు తయారు చేస్తుం దన్న నెపంతో ఇరాన్‌పై సామ్రాజ్య ఆధిపత్యం కోసం అమెరికా దాడి చేయడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి) : అణ్వాయుధాలు తయారు చేస్తుం దన్న నెపంతో ఇరాన్‌పై సామ్రాజ్య ఆధిపత్యం కోసం అమెరికా దాడి చేయడం సిగ్గుచేటని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలిగేటి రాజశేఖర్ అన్నారు. ఇరాన్‌పై అమెరికా దాడులను ఖండిస్తూ మంగళవారం సీపీఐ ఆధ్వర్యంలో సిరిసిల్ల గాంధీ చౌక్ వద్ద నాయకులు కళ్లకు నల్లగంతలు కట్టుకొని ధర్నా చేపట్టారు. ఈ సంద ర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అంతర్జాతీయ చట్టాలను బేఖాతరుచేస్తూ ఇరాన్ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేలా అమెరికా దాడులకు పాల్పడుతోందని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ఇరాన్ దేశం అణ్వాయుధాలు తయారుచేస్తుందని ఎలాంటి ఆధారాలు లేకున్నా అంతర్జాతీయ సంస్థ, ఇంటిలిజెన్స్ సంస్థలు అనుమానాలను వ్యక్తం చేయడంతో సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసం వెంపర్లాడే అమెరికా ఇదే అదనుగా భావించి ఇరాన్‌పై దాడులు చేస్తోందని ఆరోపించారు. ఇరాన్‌ను ధ్వం సంచేయడం పశ్చిమాసియాపై సామ్రాజ్యవాద ఆధిపత్యం చెలాయించడం కోసం అమెరికా దుశ్చర్యలకు పాల్పడుతోందని, ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించ డమేనన్నారు. అమెరికా దాడులను ప్రధాని మోదీ ఖండిచాలన్నారు. అమెరికా ఇజ్రాయిల్‌కు అనుకూల విదేశాంగ విధాన వైఖరి విడనాడి యుద్ధాన్ని ఆపడంలో భాగస్వామి కావాలన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కడారి రా ములు, సీపీఐ నాయకులు మీసం లక్ష్మన్, తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, మంద అనిల్ కుమార్, కుర్ర రాకేష్, సోమ నాగరాజు, అజ్జ వేణు, సొల్లు సాయి పాల్గొన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:20 AM