ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సిరిసిల్లలో సినీ నటి అనసూయ సందడి

ABN, Publish Date - May 07 , 2025 | 11:50 PM

సినీ నటి అనసూయ భరద్వాజ్‌ సిరి సిల్లలో సందడి చేశారు.

సిరిసిల్ల, మే 7 (ఆంధ్రజ్యోతి): సినీ నటి అనసూయ భరద్వాజ్‌ సిరి సిల్లలో సందడి చేశారు. పాటలపై స్టెప్పులు వేసి తన అభిమానులను ఉత్సాహపరిచారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాసం ఫ్యాషన్‌ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి అన సూయ వస్తున్నారని ప్రచారం చేయడంతో సిరిసిల్ల గాంధీ చౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన కాసం ఫ్యాషన్‌ వద్దకు పెద్ద సంఖ్యలో అనసూయ అభి మానులు తరలివచ్చారు. అనసూయ షాపింగ్‌మాల్‌ను ప్రారంభించి ఫ్లోర్‌లలో పట్టణ ప్రముఖులతో ముచ్చటించారు. అనంతరం షాపింగ్‌ మాల్‌ ఎదుట ఏర్పాటుచేసిన వేదికపై పాటలకు స్టెప్పులు వేశారు. ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. కాసం ఫ్యాషన్‌లో మంచి బ్రాండ్‌లు లభిస్తాయని సిరిసిల్లలో ప్రజలకు కూడా అందుబాటులోకి వచ్చాయని తక్కువ సమయంలోనే ఎక్కువ స్టోర్‌లు ప్రారంభించారన్నారు. కాసం మాల్‌ డైరెక్టర్లు కాసం నమశివాయ, కాసం మల్లికార్జున్‌, కాసం కేదారి నాథ్‌, కాసం శివప్రసాద్‌లు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో నాలుగు సంవత్సరాలుగా ప్రజల మన్ననలను పొందుతూ ఇప్పటివరకు తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లో 17స్టోర్‌లు ప్రారంభించామన్నారు. అధునాత ఫ్యా షన్‌ డిజైన్లను వినియోగదారులకు తక్కువ రేట్లకే నాణ్యమైన వస్త్రాల ను అందిస్తున్నామన్నారు. కాసం ఫణి, కాసం సాయికృష్ణ, ఎంసాని ప్రవీణ్‌, పుల్లూరి అరుణ్‌కుమార్‌, వరుణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి, గుజ్జె తార తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 07 , 2025 | 11:50 PM