అటవీ భూములు ఆక్రమిస్తే చర్యలు..
ABN, Publish Date - May 31 , 2025 | 12:41 AM
మారుమూల గ్రామాల్లో గిరిజనులు అటవీ భూములను చదును చేసి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీశాఖ సిరిసిల్ల రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ పేర్కొన్నారు.
వీర్నపల్లి, మే 30 (ఆంధ్రజ్యోతి): మారుమూల గ్రామాల్లో గిరిజనులు అటవీ భూములను చదును చేసి ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని అటవీశాఖ సిరిసిల్ల రేంజ్ అధికారి శ్రీహరిప్రసాద్ పేర్కొన్నారు. వీర్నపల్లి మండలం రాశిగుట్ట తండాలో గిరిజనులతో శుక్రవారం అటవీ భూముల సంరక్షణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ముక్తార్‌పాషాతో కలిసి ఆర్‌వోఆర్ భూములపై గిరిజనులకు పలు సూచనలు చేశారు. తండాలలో ప్లాంటేషన్ మొక్కలను ధ్వంసం చేసి అటవీ భూమిని చదును చేయరాదన్నారు. అడవుల సంరక్షణ కోసం ప్రతిఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ వారోత్సవాల సందర్భంగా అటవీ భూమిలో ఉన్న ప్లాస్టిక్‌ను తొలగించారు. నీరు, ధ్వని, వాయు కాలుష్యాన్ని నిర్మూలించాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటాపూర్, గంభీరావుపేట డిప్యూటీ రేంజ్ అధికారులు మోహన్ లాల్, అంజలి, ఎస్సై ఎల్లయ్య గౌడ్, స్ట్రైకింగ్ ఫోర్స్ సెక్షన్ అధికారిని భూలక్ష్మి, వీర్నపల్లి, గొల్లపల్లి, అల్మాస్‌పూర్, సిరిసిల్లా అటవీ సెక్షన్ అధికారులు రంజిత్ కుమార్, సకారం, పద్మలత, శ్రావణ్ కుమార్, ఏపీవో శ్రీహరి, బీట్ అధికారులు, బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - May 31 , 2025 | 12:41 AM