కేటీఆర్‌ను బదనాం చేయడానికే ఏసీబీ నోటీసులు
ABN, Publish Date - Jun 15 , 2025 | 12:04 AM
కేటీఆర్‌ను బదనాం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ ద్వారా నోటీసులను జారీ చేయించిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్‌ను బదనాం చేయడం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ ద్వారా నోటీసులను జారీ చేయించిందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. శనివారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ-ఫార్ములా కారు రేసింగ్ పోటీ ల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని, లైడిటెక్టర్ పరీక్షకు హాజరవుతానన్న కేటీ ఆర్‌తో పాటు నాడు ఎమ్మెల్సీకీ రూ.50లక్షలు లంచంగా ఇవ్వచూపలేదని రేవంత్ రెడ్డి లైడిటెక్టర్‌కు హాజరుకావాలని డిమాండ్‌చేశారు. అడ్డగోలు హామీలనిచ్చి అమ లు చేయలేక తెలంగాణ ప్రజల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం, నాయ కులు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చిన హా మీలను అమలుచేయడానికి ఇప్పటికే ఏరువాక మొదలైందని తెలంగాణ రైతాం గం రైతుబంధు ఎకరానికి రూ.15వేల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏరువాక మొదలుకాగానే రైతుల ఖాతాలో ఎకరానికి రూ. 5వేలు వేసి వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచిందన్నారు. ముఖ్యమంత్రి రేవం త్‌రెడ్డి రైతు బంధు, రైతు బీమాను ఇవ్వకుండా తప్పించుకోవాలని చూస్తున్నాడని ఆరోపించారు. రైతు బీమా కోసం ఎల్‌ఐసీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకుండా రైతులను ఆందోళనకు గురిచేస్తోందని,ఎల్‌ఐసీ బకాయిలను చెల్లించాలని డిమాం డ్ చేశారు. సన్నవడ్లు పండిస్తే బోనస్‌గా క్వింటాల్‌కు రూ.500 చెల్లిస్తామన్నారు ప్రస్తుతం సేకరించిన సన్న వడ్లకు బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. పదో తరగతి చదివిన విద్యార్థులకు రూ.10వేలు, ఇంటర్ చదివిన విద్యార్థులకు రూ. 15వేలు, డిగ్రీ పూర్తిచేసిన విద్యార్థులకు రూ.25వేలు, పీజీ పూర్తిచేసిన విద్యార్థుల కు రూ.50వేలు, పీహెచ్‌డీ పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5లక్షలు ఇస్తామని కాం గ్రెస్ ప్రభుత్వం హామీనిచ్చిందన్నారు. పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమైనాయ ని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారన్నారు. విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు పడకపోవడంతో వారి నుంచి చీత్కారం తప్పదని డైవర్షన్ చేయడం కోసం కేటీఆర్‌కు ఏసీబీ ద్వారా నోటీసులు ఇప్పించారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. విద్యార్థినులకు స్కూటీలు, ట్యాబ్‌లు ఇస్తామన్నారు ఎంత మందికిచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు న్యాలకొండ రాఘవరెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, బండ నర్సయ్యయాదవ్, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, కుంభాల మల్లారెడ్డి, రిక్కు మల్ల సంపత్‌కుమార్, దార్ల సందీప్, దిడ్డి రాజు, రమేష్‌గౌడ్, జవహార్‌రెడ్డి, అమర్ రావు, ప్రేమ్‌కమార్, తిరుపతి, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు.
Updated Date - Jun 15 , 2025 | 12:04 AM