ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

లంచావతారాలపై ఏసీబీ కొరడా

ABN, Publish Date - Jun 06 , 2025 | 12:51 AM

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా లంచం ముట్టజెప్పనిదే ఏ పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా చేయాల్సిన పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ ప్రజల నుంచి లంచం డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే బదులు ఎంతో కొంత ముట్టజెప్పి పని పూర్తి చేయించుకోవడం సాధారణంగా మారింది. లంచం ఇవ్వకపోతే సంబంధిత ఫైల్‌ బీరువాలోనే దుమ్ముపట్టిపోతుంది.

- ఆరున్నరేళ్లలో 78 కేసులు, 116 మంది అరెస్టు

- ప్రభుత్వశాఖల్లో తీవ్రస్థాయిలో అవినీతి

కరీంనగర్‌ క్రైం, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా లంచం ముట్టజెప్పనిదే ఏ పని కాదు. ప్రభుత్వ ఉద్యోగులు విధిగా చేయాల్సిన పనులను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తూ ప్రజల నుంచి లంచం డబ్బులు వసూలు చేస్తున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగే బదులు ఎంతో కొంత ముట్టజెప్పి పని పూర్తి చేయించుకోవడం సాధారణంగా మారింది. లంచం ఇవ్వకపోతే సంబంధిత ఫైల్‌ బీరువాలోనే దుమ్ముపట్టిపోతుంది. లంచాల బాధ భరించలేని కొందరు ఏసీబీ అధికారులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి సందర్భాలలో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా లంచావతారులను పట్టుకుని కటకటాల్లోకి నెట్టుతున్నారు. కరీంనగర్‌ రీజియన్‌లో 2019 నుంచి ఇప్పటి 2025 జూన్‌ 4వ తేదీ వరకు లంచాలు తీసుకున్న సంఘటనల్లో 78 కేసులు నమోదు చేసి 116 మంది ఉద్యోగులు, మద్యవర్తులను అరెస్టు చేశారు. ఇందులో 33 మంది రెవెన్యూ ఉద్యోగులు, 13 మంది పోలీసులు ఉన్నారు.

ఫఅమలుకాని సిటిజన్‌ చార్ట్‌

ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక పని పూర్తి చేయటానికి ప్రభుత్వం నిర్ధిష్టమైన కాలాన్ని నిర్ణయించింది. దీనినే సిటిజన్‌ చార్ట్‌ అంటారు. ఏ కార్యాలయంలోనూ సిటిజన్‌ చార్ట్‌ బోర్డు కనపడదు. ఎక్కడో ఒక కార్యాలయంలో బోర్డు కనిపించినా అది అములకు నోచుకోదు. దానిని పర్యవేక్షించే అధికారులే లేకుండా పోయారు. బాధిత ప్రజలు నిలదీస్తే వారిపనులకు, సమస్యల పరిష్కారంకు కొర్రీలు పెడుతూ పెండింగ్‌లో పెట్టి వేధిస్తున్నారు. ఇటువంటి వేధింపులకు గురైన బాధితులు చివరకు అవినీతి నిరోధకశాఖను ఆశ్రయిస్తున్నారు.

ఫ ఏసీబీకి చిక్కకుండా కొత్తదారులు...

కొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది లంచాల తీసుకునే సమయంలో ఏసీబీకి చిక్కకుండా కొత్తదారులు వెదుకుతున్నారు. కొందరు ఉద్యోగులు ప్రత్యేకంగా ఏజెంట్లను నియమించుకుంటున్నారు. మరి కొందరు దళారులతో బేరసారాలు సాగిస్తూ వారి ద్వారానే లంచాలు స్వీకరిస్తున్నారు. ఇటీవల ఇరిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఒక కాంట్రాక్టర్‌ వద్ద 60 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ పోలీసులు పట్టుకున్నారు. అయన డబ్బులను నేరుగా తీసుకోకుండా ఇంటి బయట అరుగుపై పెట్టమన్నాడు. ఆ తరువాత ఆ డబ్బులను చేతితో ముట్టకుండా ఒక టీ షర్ట్‌, మరొక బట్ట, మరొక కవర్‌లో పెట్టి ఇంటి బయట ముళ్లపొదల్లో పారేశాడు. ఏసీబీ అధికారులు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాతనే ఆ డబ్బులను అర్ధరాత్రి లేదా మరుసటి రోజు ఉదయం తీసుకోవాలనుకున్నాడు. అక్కడే మఫ్టీలో మకాం వేసిన ఏసీబీ పోలీసులకు లంచం డబ్బులు ముట్టినట్లు సమాచారం రాగానే సోదాలు చేశారు. వారికి ఎటువంటి డబ్బులు లభించలేదు. సీసీ కెమెరాలలో పరిశీలించగా అసలు విషయం తెలిసింది. దీంతో సదరు అధికారిని ప్రశ్నించగా లంచం తీసుకున్నానని ఒప్పుకోవడంతో అరెస్టు చేశారు. కొంత కాలం క్రితం మరో ఘటనలో ఏసీబీ అధికారులను చూసి ఒక ఉద్యోగి లంచం డబ్బులను టాయిలెట్‌లో వేశాడు. ఇంకో కేసులో నోట్లను నమిలిమింగాడు. లంచం తీసుకునేందుకు సహాయం చేస్తున్న దళారులు, ఏజెంట్లు, సహాయకులు, కిందిస్థాయి ఉద్యోగులపై ఏసీబీ అధికారులు కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెడుతున్నారు.

ఫ ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064...

అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగుల సమాచారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్‌ 1064కు కాల్‌ చేసి చెప్పవచ్చు. ఏసీబీ వాట్సప్‌ నంబర్‌ 9440446106, ఫేస్‌ బుక్‌ (తెలంగాణ ఏసీబీ), ట్విట్టర్‌ (ఎక్స్‌) తెలంగాణ ఏసీబీకి సమాచారం అందించవచ్చు. సమాచారం అందించినవారు పేర్లను గోప్యంగా ఉంచుతారు.

2019 నుంచి ఏసీబీకి చిక్కిన ఉద్యోగులు

==========================

సంవత్సరం కేసులు ఉద్యోగులు

=================================

2019 17 25

2020 7 11

2021 9 15

2022 13 17

2023 8 11

2024 11 17

2025 13 20

(జూన్‌ 4 వరకు)

===============================

78 116

===============================

Updated Date - Jun 06 , 2025 | 12:51 AM