ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రైల్వే పనులకు ముందడుగు

ABN, Publish Date - May 15 , 2025 | 12:49 AM

పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భద్రాద్రి కొతగూడెం జిల్లా మణుగూర్‌ వరకు కోల్‌బెల్ట్‌ కారిడార్‌ను కలిపేందుకు ప్రతిపాదించిన రామగుండం- మణుగూర్‌ రైల్వే లైన్‌కు కేంద్ర రైల్వే శాఖ 2,911.11 రూపాయలతో బడ్జెట్‌ అంచనాలను రూపొందించడం ఒక అడుగు ముందుకు పడినట్లు అయింది. అంతేగాకుండా నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి లైన్‌లో సింగల్‌ లైన్‌లో నిర్మాణమైన బైపాస్‌ లైన్‌లో డబుల్‌ లైన్‌ నిర్మాణానికి కేంద్రం 36.99 కోట్ల రూపాయలు మంజూరు చేసింది.

పూర్తయిన పెద్దపల్లి బైపాస్‌ సింగిల్‌ రైల్వే లైన్‌ (ఫైల్‌)

- రైల్వే బడ్జెట్‌ ప్రతులు విడుదల చేసిన కేంద్రం

- పలు పనులకు నిధులు కేటాయింపు

- పెద్దపల్లి- నిజామాబాద్‌ డబుల్‌ లైన్‌ సర్వేకు రూ. 3.56 కోట్లు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి భద్రాద్రి కొతగూడెం జిల్లా మణుగూర్‌ వరకు కోల్‌బెల్ట్‌ కారిడార్‌ను కలిపేందుకు ప్రతిపాదించిన రామగుండం- మణుగూర్‌ రైల్వే లైన్‌కు కేంద్ర రైల్వే శాఖ 2,911.11 రూపాయలతో బడ్జెట్‌ అంచనాలను రూపొందించడం ఒక అడుగు ముందుకు పడినట్లు అయింది. అంతేగాకుండా నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి లైన్‌లో సింగల్‌ లైన్‌లో నిర్మాణమైన బైపాస్‌ లైన్‌లో డబుల్‌ లైన్‌ నిర్మాణానికి కేంద్రం 36.99 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటవ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ 50 లక్షల 65 కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా రైల్వే శాఖకు 2.65 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. వాస్తవానికి గత ఐదేళ్ల వరకు కేంద్ర బడ్జెట్‌లో భాగంగా అన్ని శాఖలకు కలిపి ఒక బడ్జెట్‌, రైల్వేశాఖకు సంబంధించి ప్రత్యేకంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టే వారు. కానీ గత నాలుగేళ్ల నుంచి రైల్వే శాఖ బడ్జెట్‌ను కూడా కేంద్ర బడ్జెట్‌లోనే కలిపి ప్రకటిస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబం ధించి కేటాయించిన రైల్వే బడ్జెట్‌ ప్రతులను ఆ శాఖ మంగళవారం విడుదల చేసింది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిఽధిలో గల కాజిపేట- బల్లార్షా, పెద్దపల్లి - నిజామాబాద్‌ లైన్‌లో పలు అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు.

ఫ రామగుండం- మణుగూర్‌ లైన్‌కు రూ. 2,911.11 కోట్లు..

రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లో విస్తరించి ఉన్న కోల్‌ కారిడార్‌ను అనుసంధానం చేసేందుకు వీలుగా రామగుండం నుంచి మణుగూర్‌ వరకు 200 కిలోమీటర్ల దూరం వరకు రైల్వే లైన్‌ నిర్మించాలని ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ లైన్‌ కోసం పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ కృషి చేశారు. పలుసార్లు ఈ లైన్‌ గురించి సర్వేలు నిర్వహించిన రైల్వే శాఖ ఈ లైన్‌ నిర్మించడం సబబుగా భావించింది. ఆ మేరకు గత ఏడాది భూసేకరణ కోసం సంబంధిత రెవెన్యూ శాఖాధికరులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే లైన్‌ నిర్మాణానికి కావాల్సిన అంచనాలను రైల్వే శాఖ రూపొందించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో 2,911.11 కోట్ల రూపాయలు వ్యయం అవుతాయని అంచనా వేసింది. ఆ మేరకు బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. త్వరలోనే ఈ లైన్‌ నిర్మా ణానికి టెండర్లు ప్రకటించే అవకాశాలున్నాయి.

ఫ పెద్దపల్లి బైపాస్‌ డబుల్‌ లైన్‌కు రూ. 36.99 కోట్లు

నిజామాబాద్‌ నుంచి పెద్దపల్లి జంక్షన్‌ వరకు గల లైన్‌లో ప్యాసింజర్‌ రైళ్లు, గూడ్స్‌ రైళ్లు పెద్దపల్లి జంక్షన్‌కు వెళ్లకుండా నిర్మించిన పెద్దపల్లి బైపాస్‌ డబుల్‌ లైన్‌ నిర్మాణానికి 36 కోట్ల 99 లక్షల రూపాయల బడ్జెట్‌ను కేటాయించింది. సింగిల్‌ లైన్‌ ఇప్పటికే పూర్తి కాగా, ఇంకా ఈ లైన్‌ గుండా రైళ్లను అనుమితించ లేదు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అవుతున్నది. ఈ లైన్‌లో డబుల్‌ లైన్‌ ఆవశ్యకతను గుర్తించిన రైల్వే శాఖ డబుల్‌ లైన్‌ (2.169 కిలోమీటర్లు) కోసం నిధులు కేటాయించింది. దీంతో నిజామాబాద్‌ లైన్‌ గుండా కాజీపేట, వరంగల్‌ లైన్ల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్యాసింజర్‌, గూడ్స్‌ రైళ్లు పెద్దపల్లి జంక్షన్‌ మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుందా పోనున్నది. ఈ లైన్‌ లేకుంటే ప్రతి రైలుకు 45 నిమిషాల నుంచి గంటకు పైగా సమయం పడుతున్నది. ఈ లైన్‌తో ఆ ఇబ్బందులు తీరనున్నాయి. అలాగే జిల్లాలోని పొత్కపల్లి- కొల నూర్‌ మధ్యలో ఎల్‌సీ నంబర్‌ 33 (ఎం) 307/14-16 కిలోమీటర్ల మధ్యలో అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 7 కోట్ల 41 లక్షల రూపాయలు మంజూరు చేశారు. కొలనూర్‌- పెద్దపల్లి మార్గంలో ఎల్‌సి నంబర్‌ 37 (ఎం) కిలో మీటర్‌ 299 వద్ద అండర్‌ బ్రిడ్జి నిర్మాణానికి 7 కోట్ల 66 లక్షల రూపాయలు మంజూరు చేశారు. నిజామాబాద్‌- పెద్దపల్లి లైన్‌లో సుల్తానాబాద్‌ వద్ద గల యార్డు అప్‌గ్రేడేషన్‌ క్సోం 36 కోట్ల 80 లక్షలు, పెద్దపల్లిలో గూడ్స్‌ విస్తరణ కోసం 9.99 కోట్లు మంజూరు చేశారు. పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల రైల్వే స్టేషన్లలో అమృత్‌ భారత్‌ పథకం కింద ఆధునీకరణ పనులు చేపట్టారు. అదనపు పనులకు 16 కోట్ల 98 లక్షల నిధులను కేటాయించారు. పెద్దపల్లి నుంచి నిజామాబాద్‌ వరకు గల 178 కిలోమీటర్ల రైల్వే లైన్‌లో డబుల్‌ లైన్‌ నిర్మాణానికి సర్వే కోసం 3 కోట్ల 56 లక్షల రూపాయలను కేటాయించారు. రామగుండం రైల్వే స్టేషన్‌లో ఆర్‌పీఎఫ్‌ పోస్టు భవన నిర్మాణానికి సంబంధించి అదనంగా 2 కోట్ల 51 లక్షల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులతో రైల్వే ప్రయాణీకులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

Updated Date - May 15 , 2025 | 12:49 AM