వర్షపు నీటి సంరక్షణకు ప్రణాళిక రూపొందించాలి
ABN, Publish Date - Apr 25 , 2025 | 12:18 AM
రానున్న వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సేకరణ, సంరక్షణ చర్యలపై మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రానున్న వర్షాకాలంలో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ ప్రపుల్‌దేశాయ్ అధికారులను ఆదేశించారు. వర్షపు నీటి సేకరణ, సంరక్షణ చర్యలపై మున్సిపల్, ఇరిగేషన్ అధికారులతో గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వర్షాకాలంలో ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అధికారులంతా సమన్వయంతో ఒక ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. 200 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న ఇండ్లలో నీటి సరంక్షణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. వర్షపు నీరు నేలలోకి ఇంకేలా ఇంకుడు గుంతల నిర్మాణం తప్పని సరి చేయాలన్నారు. కొండలు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో జాలువారే వరద నీటిని భూగర్భంలోకి ఇంకేలా కందకాలు తవ్వడం వంటి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Apr 25 , 2025 | 12:19 AM