ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అరకొరగా జీలుగ విత్తనాలు

ABN, Publish Date - May 25 , 2025 | 12:13 AM

వానాకాలం పంట సాగుకు సన్నద్ధమైన రైతులకు జీలుగ, జనుము విత్తనాల కోసం పడిగాపులు తప్పడం లేదు. పంట వేసే నెల రోజుల ముందే జీలుగ, జనుము విత్తనాలను పొలంలో చల్లుతారు.

కరీంనగర్‌ రూరల్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): వానాకాలం పంట సాగుకు సన్నద్ధమైన రైతులకు జీలుగ, జనుము విత్తనాల కోసం పడిగాపులు తప్పడం లేదు. పంట వేసే నెల రోజుల ముందే జీలుగ, జనుము విత్తనాలను పొలంలో చల్లుతారు. విత్తనాలు వచ్చాయని శుక్రవారం వ్యవసాయ శాఖ అధికారులు సమాచారం ఇవ్వడంతో రైతులు ఉదయం నుంచే బారులు తీరారు. కోటా ప్రకారం నగునూర్‌కు వచ్చిన విత్తనాలు గంటలోపే ముగిసాయి. తీగలగుట్టపల్లిలో డీసీఎంఎస్‌ షాప్‌ ముందు ఉదయం నుంచే రైతులు పడిగాపులు కాశారు. కరీంనగర్‌ మండలానికి 130 క్వింటాళ్ల జీలుగ, 80 క్వింటాళ్ల జనుము స్టాక్‌ వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ప్రకటించారు. కానీ నగునూర్‌లోని రైతు ఆగ్రోస్‌ కేంద్రంలో 30 క్వింటాళ్ల జీలుగ, 50 క్వింటాళ్ల జనుము స్టాక్‌ రావడంతో ఉన్న రైతులకు ఇచ్చి పంపించారు. తీగలగుట్టపల్లిలోని డీసీఎంఎస్‌లో 50 క్వింటాళ్ల జీలుగ కేటాయిచంగా శనివారం సాయంత్రం స్టాక్‌ వచ్చింది. కరీంనగర్‌ డీసీఎంఎస్‌కు ఇంకా స్టాక్‌ రాకపోవడంతో రైతులు ఎదురు చూపులు తప్డం లేదు. రైతుల డిమాండ్‌ మేరకు ఇండెంట్‌లు పెడుతున్నామని స్టాక్‌ వచ్చిన వెంటనే అందజేస్తున్నామని మండల వ్యవసాయ శాఖ అధికారి బి సత్యం తెలిపారు. ఆదివారం అన్ని కేంద్రాల నుంచి రైతులకు విత్తనాలను అందిస్తామని తెలిపారు.

Updated Date - May 25 , 2025 | 12:14 AM