బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు హర్షణీయం
ABN, Publish Date - Jul 12 , 2025 | 12:51 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు.
- జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్
జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని మోతే రోడ్డులో కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్‌కు మార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు మిఠాయి పంపిణీ జరిపారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్‌కు మార్ మాట్లాడారు. రాష్ట్రంలో అమలులో ఉన్న పంచా యతీరాజ్ చట్టం-2018ను సంవరించి, ఆర్డినెన్స్‌ను తేవడం ద్వారా ఈ రిజర్వేషన్లను వర్తింపజేయడానికి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని అన్నివర్గాలు హర్షిస్తున్నాయన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 42 శాతం రిజర్వేషన్లతో స్థానికసంస్థల ఎన్నికలకు వెళ్లడా నికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. సమావేశంలో జగిత్యాల, రాయికల్ మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగ భూషణం, మోర హన్మాండ్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ తోనే సామాజిక న్యాయం
మాజీ మంత్రి జీవన్‌రెడ్డి
జగిత్యాల, జూలై 11 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌లు అమలుకు రాష్ట్ర మంత్రి వర్గం తీర్మానం చేయడాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ నాయకులు సంబురాలు చేసు కున్నారు. ఈ సందర్బంగా ఇందిరా భవన్‌నుంచి తహసీల్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలి వచ్చిన కాం గ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచిపెట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు విషయంలో ఎలాంటి ఆ టంకాలు సృష్టించిన బలహీనవర్గాల ద్రోహిగా మిగిలి పోతారన్నారు. కార్యక్ర మంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షు డు గాంజంగి సందయ్య, టీపీసీసీ కార్యదర్శి బండ శంకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jul 12 , 2025 | 12:51 AM