ప్రజావాణికి 328 దరఖాస్తులు
ABN, Publish Date - Jul 29 , 2025 | 12:39 AM
ప్రజావాణి కార్యక్రమానికి 328 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వాఖడే తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరింయలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె దరఖాస్తులు స్వీకరించారు.
సుభాష్‌నగర్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్రమానికి 328 దరఖాస్తులు వచ్చినట్లు అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వాఖడే తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరింయలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులు దరఖాస్తులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్‌దేశాయ్, డీఆర్వో వెంకటేశ్వర్లు, కరీంనగర్ ఆర్‌డీవో మహేశ్వర్, హుజురాబాద్ ఆర్‌డీవో రమేశ్ పాల్గొన్నారు.
ఫ నష్టపరిహారం ఇప్పించండి...
బ్రిడ్జి నిర్మాణంలో తమ వ్యవసాయ భూమిని కోల్పోయామని, దానికి సంబందించిన నష్టపరిహారం ఇప్పించాలని నిర్వాసిత రైతులు అధికారులను కోరారు. ఈమేరకు సోమవారం ప్రజావాణిలో వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామడుగు నుంచి కరీంనగర్‌కు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణంలో భాగంగా రామడుగు, షానగర్ గ్రామాల మధ్యలో మోతె వాగుపై ప్రభుత్వం వంతెన నిర్మించిందన్నారు. వంతెన నిర్మాణంలో తమ వ్యవసాయ భూమి, కోళ్ల ఫారం కోల్పోయామని తెలిపారు. అందుకు సంబందించిన నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేవారు. నష్టపరిహారం కోసం ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ స్పందించి నష్టపరిహారం ఇప్పించాలని కోరారు.
ఫ న్యాయం చేయండి..
తనకు న్యాయం చేయాల్సిన తహసీల్దార్ అక్రమార్కులకు వత్తాసు పలుకుతున్నారని గంగాధర శాంతమ్మ ఆరోపించారు. సోమవారం ప్రజావాణిలో ఆమె ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన తాము మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ఎండి గౌస్ అనేవ్యక్తి నుంచి సర్వే నంబరు 94లో 34 గుంటల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ స్థలాన్ని తనపేరుపై రిజిస్ట్రేషన్ చేసుకుని, ఖాస్తుకు ఉంటున్నామని తెలిపారు. ఆస్థలంలో ఎండి నజీర్ అనేవ్యక్తి తన అనుచరులతో అక్రమంగా షెడ్డు వేసి ప్రహరీ నిర్మించారన్నారు. ఈ విషయం తహసీల్దారుకు ఫిర్యాదు చేయగా తమకు న్యాయం చేయాల్సిందిపోయి వారికే వత్తాసు పలుకుతున్నారన్నారు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
Updated Date - Jul 29 , 2025 | 12:39 AM