ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా కాకతీయుల వారసుడి కల్యాణం

ABN, Publish Date - Feb 22 , 2025 | 04:17 AM

కాకతీయుల రాజవంశంలో 22వ తరం వారసుడైన కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ కల్యాణం శుక్రవారం ఖజురహోలో అంగరంగ వైభవంగా జరిగింది. బస్తర్‌ మహరాజు అయిన భంజ్‌ దేవ్‌.. నాగోడ్‌ యువరాణి భువనేశ్వరిని వివాహమాడారు.

  • నాగోడ్‌ యువరాణిని పెళ్లాడిన కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌

  • 2022లో మొదటిసారి ఓరుగల్లుకు వచ్చిన కమల్‌చంద్ర

హనుమకొండ, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): కాకతీయుల రాజవంశంలో 22వ తరం వారసుడైన కమల్‌ చంద్ర భంజ్‌ దేవ్‌ కల్యాణం శుక్రవారం ఖజురహోలో అంగరంగ వైభవంగా జరిగింది. బస్తర్‌ మహరాజు అయిన భంజ్‌ దేవ్‌.. నాగోడ్‌ యువరాణి భువనేశ్వరిని వివాహమాడారు. ఈ వేడుకకు దేశంలోని వివిధ రాజవంశాల ప్రముఖులు హాజరయ్యారు. కల్యాణ వేడుకల్లో భాగంగా అక్కడి సంప్రదాయం ప్రకారం మాతా దంతేశ్వరి అమ్మవారికి ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్ర మహిళా పోలీసు దళం తుపాకీ పేల్చి గౌరవ వందనం సమర్పించింది. ఇక కాకతీయ వారసుడి వివాహం కోసం ప్రత్యేకంగా మూడు విమానాలు, రెండు హెలీకాప్టర్లు ఏర్పాటు చేశారు. ఏనుగు అంబారీ, ఒంటెల ప్రదర్శన, గిరిజనుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారం రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేరొందిన కళాకారులు తమ ప్రదర్శనలు ఇచ్చారు.


శనివారం వరంగల్‌కు చెందిన గజ్జెల రంజిత్‌ బృందం ఆధ్వర్యంలో పేరిణి నృత్యప్రదర్శన జరగనుండగా.. వరంగల్‌కు చెందిన చరిత్రకారుడు, టార్చ్‌ సంస్థ కార్యదర్శి అరవింద్‌ ఆర్యా ఈ వివాహ వేడుకల్లో పాల్గొంటున్నారు. 700 ఏళ్ల తర్వాత కాకతీయుల రాజవంశం నుంచి 22వ తరం వారసుడిగా తమ పూర్వీకులు ఏలిన ఓరుగల్లు గడ్డపై కమల్‌చంద్ర భంజ్‌ దేవ్‌ 2022 జూలై 7న మొదటిసారి అడుగుపెట్టారు. కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల్లో పాల్గొనేందుకు ముఖ్యఅతిథిగా ఆయన వచ్చారు. ఆయనకు ఓరుగల్లు వాసులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Scandal Exposed: భర్త వేరే మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..

BJP: సికింద్రాబాద్‌లో బీజేపీ శ్రేణుల సంబురాలు..

Water Shortage: పట్టణాల్లో నీటికి కటకట

Read Latest Telangana News and Telugu News

Updated Date - Feb 22 , 2025 | 04:18 AM