ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

K Ramakrishna Rao IAS: బ్రేకింగ్ .. తెలంగాణ కొత్త సీఎస్‌గా కే రామకృష్ణారావు

ABN, Publish Date - Apr 27 , 2025 | 06:52 PM

K Ramakrishna Rao IAS: ప్రస్తుత సీఎస్ శాంత కుమారి ఈనెల 30వ తేదీన పదవీ విరమణ పొందనున్నారు. ఆమె స్థానంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.

K Ramakrishna Rao IAS

తెలంగాణ రాష్ట్ర కొత్త సీఎస్‌గా కే రామకృష్ణారావు నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ శాంత కుమారి ఈనెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆమె స్థానంలో ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్‌గా ఉన్న రామకృష్ణారావు కొత్త సీఎస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు.


రామకృష్ణారావు 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం ఆయన తెలంగాణ ప్రభుత్వంలోనే ఆర్థిక ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 2016 ఫిబ్రవరి నుంచి ఆర్థిక శాఖలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆయన పదవీ కాలం ఈ ఏడాది ఆగస్టుతో ముగియనున్నది.


భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

పరిపాలనలో ప్రక్షాళన దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్పులు చేపట్టారు. ఈ మేరకు నిర్వహణ అవసరాల దృష్ట్యా పలువురు IAS అధికారులను బదిలీ చేశారు. సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ వైస్‌ చైర్మన్‌గా శశాంక్‌ గోయల్‌.. ఇండస్ట్రీ & ఇన్వెస్ట్‌మెంట్‌ సెల్‌ సీఈవోగా జయేశ్‌ రంజన్‌.. పరిశ్రమలు, వాణిజ్యం ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌.. పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శిగా టీకే శ్రీదేవి.. కార్మికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీగా దాన కిశోర్‌.. ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీగా స్మితా సబర్వాల్‌.. పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఇలంబర్తి.. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌.. ఫ్యూచర్‌ సిటీ డెవలప్‌మెంట్‌ అథారిటీ కమిషనర్‌గా కె.శశాంక.. జెన్‌కో సీఎండీగా ఎస్‌.హరీష్‌.. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ సెక్రటరీ, సీఈవోగా నిఖిల.. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా సంగీత సత్యనారాయణ.. దేవాదాయశాఖ డైరెక్టర్‌, యాదగిరిగుట్ట ఈవోగా ఎస్‌.వెంకటరావు.. సెర్ప్‌ అదనపు సీఈవోగా పి.కాత్యాయనీదేవి నియమితులయ్యారు.


ఇవి కూడా చదవండి

Pahalgam Terror Attack: ఉగ్రదాడి.. ఫొటో గ్రాఫర్‌ను విచారిస్తున్న ఎన్ఐఏ

Shruti Haasan: లవ్ ఫెయిల్యూర్స్ గురించి స్పందించిన శృతి

Updated Date - Apr 27 , 2025 | 07:08 PM