ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jagga Reddy: సోనియా, రాహుల్‌ నాయకత్వంలో.. రేవంత్‌ ప్రజాపాలన భేష్‌

ABN, Publish Date - Jan 26 , 2025 | 03:46 AM

సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులను బద్నాం చేసే పనిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పడ్డాయని ఆరోపించారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన బాగా నడుస్తోందని కితాబునిచ్చారు.

నేటి నుంచీ రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు .. రైతు, ఇందిరమ్మ భరోసా అమలు ప్రారంభం

  • వాటి అమలుకు మేం ప్రజల్లోకి వెళ్తుంటే.. ప్రతిపక్షాల నేతలకు నిద్ర పట్టట్లేదు

  • ప్రజలు, అధికారుల్ని సమన్వయం చేయడంలో సీఎం, మంత్రులు సక్సెస్‌

  • రేవంత్‌ పాలన చూసి కేటీఆర్‌, హరీశ్‌ల బుర్ర బ్లాక్‌ అయింది

  • ప్రజల బుర్రనూ పాడు చేస్తున్నరు?: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌కార్డులు, పేదోళ్లకు ఇందిమ్మ ఇళ్లు, రైతులకు భరోసా, భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఆత్మీయ భరోసా ఇచ్చేందుకు తాము ప్రజల్లోకి వెళుతుంటే.. ప్రతిపక్షాలకు నిద్ర పట్టట్లేదని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని, మంత్రులను బద్నాం చేసే పనిలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు పడ్డాయని ఆరోపించారు. సోనియా, రాహుల్‌గాంధీల నాయకత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రజా పాలన బాగా నడుస్తోందని కితాబునిచ్చారు. పథకాల అమలుకు నిధులు సమకూర్చుకుంటూ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతోందన్నారు. గాంధీభవన్‌లో శనివారం మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ ప్రజలు, అధికారులను సమన్వయం చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు సక్సెస్‌ అయ్యారని చెప్పారు.


‘పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో సచివాలయానికి ప్రజలు వెళ్లారా? జర్నలిస్టులకు కూడా అనుమతి లేదు. కానీ మా పాలనలో మంత్రుల చాంబర్లన్నీ రాత్రి 12 గంటల దాకా కిటకిటలాడుతున్నాయ’న్నారు. హామీలు అమలు చేయండంటారు.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలుచేస్తే సీట్లు దొరకట్లేదంటూ మళ్లీ ఆరోపిస్తున్నారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఇప్పటి వరకు కోటి మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారని చెప్పారు. ‘పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన గ్రామసభలకు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఎందుకు పోలేదు?’ అంటూ నిలదీశారు. ‘సీఎం రేవంత్‌ ప్రజా పాలన చూసి కేటీఆర్‌, హరీశ్‌ రావులకు కళ్లు మండుతున్నయి. వారి బుర్రలు పాడై పోయినయి. బుర్రలు ఖరాబు అయి ఉన్న కేటీఆర్‌, హరీశ్‌ రావులు.. మంది బుర్రలు ఎందుకు పాడు చేస్తున్నరు?’’ అని అన్నారు.


సంజయ్‌.. తెలంగాణ ప్రజల్ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నవా?

బండి సంజయ్‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లిందని, కేంద్ర మంత్రిగా ఎలా మాట్లాడాలన్నది నేర్చుకుంటే ఆయనకు మంచిదని జగ్గారెడి అన్నారు. రాజకీయ అనుభవం లేకున్నా మంత్రి పదవి రావడంతో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని విమర్శించారు. ‘‘ఇందిరమ్మ పేరు పెడితే ఇళ్లకు డబ్బులు ఇయ్యవా? నిధులు ఇవ్వనని చెప్పి తెలంగాణ ప్రజల్నే బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నవా? డబ్బులు ఏమైనా సీఎం రేవంత్‌ ఇంటికి పంపుతున్నవా? కేంద్రానికి నిధులు వస్తున్నదీ.. ప్రజలు కడుతున్న పన్నులతోనే అన్నది మర్చిపోకు’’ అంటూ సంజయ్‌పై ధ్వజమెత్తారు. రాజకీయంగా సీఎం రేవంత్‌తో కొట్లాడొచ్చునని, అంతేకానీ కేంద్ర మంత్రి అయుండీ తెలంగాణ ప్రజల్ని బ్లాక్‌ మెయిల్‌ ఎలా చేస్తారని నిలదీశారు. బండి సంజయ్‌ మాటలను కిషన్‌రెడ్డి సమర్థిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 03:46 AM