JAC Protest: సమస్యలు పరిష్కరించకుంటే 15 నుంచి ఉద్యమమే
ABN, Publish Date - Jul 27 , 2025 | 04:22 AM
ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి ఉద్యమ కార్యచరణ చేపడతామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది.
సర్కారుకు ఉద్యోగుల జేఏసీ హెచ్చరిక
హైదరాబాద్, జూలై 26(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే ఆగస్టు 15 నుంచి ఉద్యమ కార్యచరణ చేపడతామని ఉద్యోగుల జేఏసీ హెచ్చరించింది. హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడుతూ 2023 జూలై 1 నుంచి అమలు చేయాల్సిన నూతన వేతన సవరణ కోసం మాట్లాడకపోవడం, 57 డిమాండ్లపై నివేదికను బయట పెట్టకపోవడం అధికారుల నిర్లక్ష్యమేనన్నారు. సెప్టెంబరు 1న పెన్షన్ విద్రోహదినంగా పాటించనున్నట్లు ప్రకటించారు.
Updated Date - Jul 27 , 2025 | 04:22 AM