ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: బడుల్లో ఏఐ టెక్నాలజీతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ

ABN, Publish Date - Mar 09 , 2025 | 03:01 AM

కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు.

  • ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ బోధనా సామర్థ్యాలను మరింత పెంచుకునేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామన్నారు. శనివారం సచివాలయంలో తెలంగాణ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దిల్‌ రాజు ఆధ్వర్యంలో కోణం ఫౌండేషన్‌ నిర్వాహకులు సందీప్‌ కుమార్‌ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.


ఈ సందర్భంగా శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ... అన్ని రంగాల్లో ఎమర్జింగ్‌ టెక్నాలజీలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య(పీపీపీ) విధానంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ‘ఏఐ సిటీ’ని ఏర్పాటు చేయనున్నామని, ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఏఐ సాయంతో ఉచితంగా నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్‌ సేవలను అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఫౌండేషన్‌ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో..

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Updated Date - Mar 09 , 2025 | 03:02 AM