ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad-తుమ్మిడిహెట్టి వద్ద నీరు లేదనడం సరికాదు

ABN, Publish Date - Jul 09 , 2025 | 11:02 PM

కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే తగినంత నీరు లేదని చెప్పడం సరికాదని సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహించి పుష్కరఘాట్‌లకు తగలడంతో బుధవారం ఆయన పరిశీలించారు.

ప్రాణహిత వద్ద మాట్లాతున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

కౌటాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తే తగినంత నీరు లేదని చెప్పడం సరికాదని సిర్పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఉధృతంగా ప్రవహించి పుష్కరఘాట్‌లకు తగలడంతో బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏటా 200 టీఎంసీలకు తక్కువ కాకుండా నీటి లభ్యత ఉన్నా గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికే కాళేశ్వరం వద్ద మేడిగడ్డ బ్యారేజీ నిర్మించిందని విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పునరుద్ధరిస్తామని తెలిపారని అన్నారు. ఇప్పటి వరకు డీపీఆర్‌ కూడా సిద్ధం చేయలేదని చెప్పారు. ఈ రోజు సాగునీటి శాఖ మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డి ప్రజాభవన్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తున్నారని, తుమ్మిడిహెట్టి వద్ద ఉన్న నీటి ఉధృతిని వారికి తెలియజేయడానికి ఈ ప్రాంతాన్ని సందర్శించి వారికి లైవ్‌ వీడియో ద్వారా సందేశాన్ని పంపించానని తెలిపారు. వెంటనే సమగ్ర రిపోర్టు తయారు చేసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిర్మిస్తే ప్రాణహిత నుంచి చేవెళ్ల వరకు నీటిని మళ్లించవచ్చని తెలిపారు. ఎల్లంపల్లి వరకు కేవలం గ్రావిటీ ద్వారా నీటిని తరలించి ఎల్కలంపల్లి నుంచి ఇప్పుడున్న లిఫ్ట్‌లను ఉపయోగించుకుంటే సరిపోతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం వచ్చే ప్రాజెక్టును కాంగ్రెస్‌ ప్రభ్తువం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం, నాయకులు విజయ్‌, మోతిరాం, సాయి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభం

కాగజ్‌నగర్‌, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్‌లో ఇందిరమ్మ ఇళ్ల పనులను బుధవారం ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో ప్రభుత్వం సూచనలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నాయకులు సిందం శ్రీనివాస్‌, బాల్క శ్యాం, అరుణ్‌లోయా, గజ్జల లక్ష్మణ్‌; శ్రీనివాస్‌, బంక శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులు సిర్పూరు ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు.

మొక్కలు నాటిన ఎమ్మెల్యే

కౌటాల, జూలై 9 (ఆంధ్రజ్యోతి): కౌటాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రాథ మిక, ఉన్నత పాఠశాలల్లో బుధవారం వన మహోత్సవంలో భాగంగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవాన్ని పండగలాగా నిర్వహించి మొక్కలను కాపాడాల్సిన బాద్యత విద్యార్థులపై ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులు పాఠశాలలో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవయ్య, తహసీల్దార్‌ ప్రమోద్‌, ఎంపీడీవో రమేష్‌, ఎంఈవో హనుమంతు, నాయకులు శ్రీశైలం, విజయ్‌, రాజేం దర్‌, మోతిరాం, తిరుపతిగౌడ్‌, మధుకర్‌, చందు, మహేష్‌, శ్రీనివాస్‌, తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Jul 09 , 2025 | 11:02 PM