బీవెల్లెంల రిజర్వాయర్‌లో నీళ్లున్నాయా
ABN, Publish Date - May 30 , 2025 | 12:48 AM
మీ నాయకుడు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామం బీ.వెల్లెంలలో ప్రారంభించిన ఉదయసముద్రం రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్నారు.
బీవెల్లెంల రిజర్వాయర్‌లో నీళ్లున్నాయా
ఆరా తీసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కోమటిరెడ్డితో కలిసి నార్కట్‌పల్లిలో ఆగిన భట్టి
నార్కట్‌పల్లి, మే 29 (ఆంధ్రజ్యోతి): మీ నాయకుడు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్వగ్రామం బీ.వెల్లెంలలో ప్రారంభించిన ఉదయసముద్రం రిజర్వాయర్‌లో నీళ్లు ఉన్నాయా అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక కాంగ్రెస్ నేతలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి గురువారం ఖమ్మం జిల్లా పర్యటనకు వెళ్తూ మార్గమధ్యలో నార్కట్‌పల్లి వద్ద కొద్దిసేపు ఆగారు. డిప్యూటీ సీఎం అయినా స్థానిక ఓ హోటల్ వద్ద సామాన్యుడిలా భట్టి కూర్చుని మంత్రి కోమటిరెడ్డితో కలిసి టీ తాగారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నియోజకవర్గ నాయకుడు దైద రవీందర్‌తో పాటు నార్కట్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బత్తుల ఊశయ్యలను భట్టికి కోమటిరెడ్డి పరిచయం చేశారు. ఈ సందర్భంగా భట్టి వారితో మాట్లాడుతూ ఉదయసముద్రం రిజర్వాయర్ నీటిపై ఆరా తీశారు. కాల్వలు పూర్తయిన తర్వాత చెరువులకు నీటిని మళ్లిస్తున్నామని వారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి తెలిపారు.
Updated Date - May 30 , 2025 | 12:48 AM