ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మెస్‌ నిర్వహణ మహిళలకు అందేనా..?

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:42 PM

ప్రభుత్వ ఆసు పత్రుల్లో మెస్‌ నిర్వహణ మహిళా సంఘాలకే ఇవ్వాల నే ప్రభుత్వ నిర్ణయం మంచిర్యాల జనరల్‌ ఆసుపత్రిలో అమలయ్యే అవకాశాలు లేవు. రోగులకు నాసిరకం భో జనం పెడుతున్నారనే ఆరోపణతో ప్రభుత్వం ఈ నర్ణ యం తీసుకుంది.

మంచిర్యాల జనరల్‌ ఆసుపత్రిలో ఇప్పటికే పూర్తయిన టెండరింగ్‌

రెండేళ్ల పాటు ఆ కాంట్రాక్టర్‌కే నిర్వహణ బాధ్యతలు

ప్రభుత్వ ప్రకటనకు మూడు రోజుల ముందు టెం డర్లు ఓపెన్‌

ప్రభుత్వ ఆదేశాలు అమలుకు నోచుకునేనా...!

మంచిర్యాల, జూన్‌3 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసు పత్రుల్లో మెస్‌ నిర్వహణ మహిళా సంఘాలకే ఇవ్వాల నే ప్రభుత్వ నిర్ణయం మంచిర్యాల జనరల్‌ ఆసుపత్రిలో అమలయ్యే అవకాశాలు లేవు. రోగులకు నాసిరకం భో జనం పెడుతున్నారనే ఆరోపణతో ప్రభుత్వం ఈ నర్ణ యం తీసుకుంది. మెస్‌ నిర్వహణ కాంట్రాక్టు గడువు పూర్తికావడంతో ఇటీవల టెండరింగ్‌ ప్రక్రియ పూర్తి చే సిన అధికారులు స్థానికంగా ఓ ఎజెన్సీకి బాధ్యతలు అ ప్పగించారు. దీంతో మహిళలకే మెస్‌ నిర్వహణ బాధ్య తలు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి బ్రేక్‌ పడి నట్లయింది. రోగులకు నాణ్యమైన భోజనం అందిం చే లా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. ఇం దులో భాగంగా గత నెల 24న సెక్రటెరియట్‌లో వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష స మావేశం జరిగింది. ఇందులో భాగంగా రోగులకు నా ణ్యమైన భోజనం అందించాలనే నిర్ణయానికి వచ్చింది. ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెస్‌ నిర్వహణ కాంట్రాక్టర్ల గడువు ముగిసినందున మహిళా సమాఖ్య సంఘాలకు ఆ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు.

సమీక్ష రోజే ముగిసిన టెండరింగ్‌...

మంచిర్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రెండేళ్లు గా కొనసాగుతున్న మెస్‌ నిర్వహణ కాంట్రాక్టర్‌ గడు వు ముగియడంతో తప్పని సరి పరిస్థితుల్లో అధికారు లు టెండర్లను ఆహ్వానించారు. గత నెల 16న టెండర్ల కు ఆహ్వానం పలుకగా 23న టెండర్లు దాఖలుకు తుది గడువు ముగిసింది. దీంతో మరునాడు ఉదయం 11 గంటలకు టెండర్లు ఓపెన్‌చేశారు. శ్రీకృష్ణ కన్‌స్ట్రక్షన్స్‌ ఏ జెన్సీకి మెస్‌ నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఈ నెల 5వ తేదీ నుంచి రోగులకు కాంట్రాక్టు ఏజెన్సీ భో జనం సరఫరా చేయనుంది.

మహిళా సంఘాలకు నిర్వహణ బాధ్యతలు అప్ప గించేందుకు ఆదేశాలు..

మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెస్‌ నిర్వహణ బాధ్యతలు మహిళా సంఘాలకు అప్పగించాలని రాష్ట్ర మెడికల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ కార్యాలయం నుంచి గత నెల 27న ఆదేశాలు జారీ అయ్యాయి. 24వ తేదీనే వై ద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ అధికారులు సమా వేశమై మహిళ సంఘాలకు అప్పగించాలనే విషయం మీద నిర్ణయానికి వచ్చాయి. దీనిపై విధివిధానాలు రూ పొందించిన తరువాత మూడు రోజులు ఆలస్యంగా మె డికల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ నుంచి ఆదేశాలు వెలువ డ్డాయి. అయితే హైదరాబాద్‌లో ఓ వైపు సమీక్ష స మావేశం జరుగుతుండగానే మంచిర్యాలలో టెండర్లు ఓ పెన్‌ చేశారు. మెడికల్‌ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల సూపరింటెం డెంట్‌లు, మెస్‌ నిర్వహణ బాధ్యతలు, మహిళా సమా ఖ్య సంఘాలకు అప్పగించాల్సి ఉంది. అయితే సమీక్షా సమావేశానికి ముందే టెండర్లు కాల్‌ఫర్‌ చేయడంతో మంచిర్యాలలో గడువు ముగిసిన మరునాడు టెండర్లు ఓపెన్‌చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందులో త క్కువ కోట్‌ చేసిన ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించాల్సి ఉండగా అధికారులు ఆ ప్రకారమే కొత్త కాంట్రాక్టర్‌కు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో ఈ నెల 5 నుంచి కొత్త కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ రోగులకు భో జనం అందించనుంది. ఆసుపత్రిలో 330 మంది రోగుల కు ఆహారం అందించాల్సి ఉండగా ప్రభుత్వం ఒక్కొక్క రికి రూ.80 కేటాయించింది. కనీసం ఐదు శాతం మేర కు మైనస్‌ టెండర్లు వేయాలని సూచించారు. మే 23వ తేదీ టెండర్‌ దాఖలు చేయడానికి చివరి తేదీ వరకు నిర్ణయించారు. మరునాడు టెండర్లను తెరిచారు. టెండ ర్లలో పాల్గొన్న వారందరూ రూ.72కే భోజనం అందించేందుకు దాఖలు చేశారు. దీంతో అత్యధిక ట ర్నోవర్‌ ఉన్న కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి గత నెల 28న ఆ ర్డర్‌ ఇచ్చారు. అయితే మెస్‌లను మహిళా గ్రూపులకు ఇవ్వాలని 27వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. ఉత్తర్వులు వెలువడిన మరునాడు కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి అవార్డు చేయడం కొసమెరుపు. పక్కనే ఉన్న రామగుండం ప్రభుత్వ ఆసుపత్రి మెస్‌కు సంబంధిం చిన టెండర్లు మే30న తెరువాల్సి ఉండగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అనుసరిస్తూ అక్కడ అధికారులు టెండర్లను రద్దు చేశారు.

ప్రభుత్వ ఆదేశాలు అమలయ్యేనా...?

మహిళా సంఘాలకే మెస్‌ చార్జీలు అప్పగించాలనే ప్రభుత్వ ఆదేశాలు మంచిర్యాలలో కానరావడం లేదు. ఇప్పటికే కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి అవార్డు అందజేయడమే దీనికి కారణంగా నిలుస్తోంది. అయితే పాత టెండర్లు ముగిసి కొత్త కాంట్రాక్టుకు బాధ్యతలు అప్పగించడం, కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీ ఇంకా తమ విధులను ప్రారంభిం చకపోవడంతో టెండర్లను రద్దు చేసి మహిళా సంఘా లకు అప్పగించాలనే డిమాండ్లు సర్వత్ర వినిపిస్తున్నా యి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్ట ర్‌ హరిచంద్ర రెడ్డిని వివరణ కోరగా నిబంధనల మేరకే టెండర్లు ఓపెన్‌ చేసి కాంట్రాక్టింగ్‌ ఏజెన్సీకి బాధ్యతలు అప్పగించామన్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అం దితే సంబంధిత కాంట్రాక్టును రద్దు చేసి మహిళా సం ఘాలకు అప్పగించే వెసులుబాటు ఉంటుందని తెలిపారు.

Updated Date - Jun 03 , 2025 | 11:42 PM