ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మూసీ కాల్వలకు సాగునీటి విడుదల 18న?

ABN, Publish Date - Jul 14 , 2025 | 01:04 AM

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ఈ నెల 18వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది.

మూసీ జలాశయం

మూసీ కాల్వలకు సాగునీటి విడుదల 18న?

అధికారుల నిర్ణయం

కేతేపల్లి, జూలై 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జునసాగర్‌ తర్వాత రెండో పెద్ద సాగునీటి వనరుగా ఉన్న మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ఆయకట్టులో వానాకాలం పంటల సాగుకు ఈ నెల 18వ తేదీ నుంచి నీటిని విడుదల చేయనున్నట్లు తెలిసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించిన రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ (స్కైవమ్‌) సమావేశంలో ఈ మేరకు అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. 645 అడుగులు (4.46టీఎంసీలు) పూర్తిస్థా యి నీటినిల్వ సామర్థ్యం గల మూసీ రిజర్వాయర్‌ నీటిమట్టం వానాకాలం సీజన్‌ ప్రారంభమయ్యే నాటికి 641 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరడంతో నీటి విడుదల చేయాలని ఆయకట్టు రైతుల నుంచి మూసీ అధికారులకు విజ్ఞప్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తులతో పాటు ప్రాజెక్టు నిండా నీళ్లు... ఆయకట్టులో కన్నీళ్లు... శీర్షికన ఆంధ్రజ్యోతి మినీలో శుక్రవారం ప్రచురితమైన వార్త కథనాన్ని మూసీ ప్రాజెక్టు అధికారులు హైదరాబాద్‌లో జరిగిన స్కైవమ్‌ సమావేశం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వలు, ఆయకట్టులో పంటల సాగుకు ఎంత మేర నీరు అవసరమవుతుంది. రాబోయే రోజుల్లో ఎగువ నుంచి వచ్చే నీటి వివరాలపై మూసీ అధికారులతో సమీక్షించిన స్కైవమ్‌ అధికారులు ఆయకట్టుకు సాగునీటి విడుదలకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే మూసీ నీటి విడుదలలో సెంటిమెంట్‌ నెంబర్‌గా ఉన్న 18ని కొనసాగించే చర్యల్లో భాగంగా మూసీ అధికారులు ఈ నెల 18 నుంచి ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. కొన్నేళ్లుగా మూసీ ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు యాసంగిలో డిసెంబరు 18వ తేదీన సాగునీటిని విడుదల చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే ఆనవాయితీని ఈ ఏడాది వానాకాలం కూడా అమలు చేయనున్నుట్లు తెలుస్తుంది. ఈలోగా ఎగువన సరైన వర్షాలు కురిస్తే వచ్చే వరదలతో ప్రాజెక్టు నీటిమట్టం మరో అడుగు పెరిగి 642 అడుగులకు చేరుతుంది. గత ఏడాది వానాకాలంలో సైతం ప్రాజెక్టు నీటిమట్టం 642 అడుగులకు చేరిన తర్వాత జూలై 25వ తేదీన ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న మూసీ అధికారులు ఈ నెల 18వ తేదీ వరకు వేచి చూసి 18న ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.

Updated Date - Jul 14 , 2025 | 01:04 AM