ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌..మూలకేనా

ABN, Publish Date - Jun 22 , 2025 | 11:47 PM

ఎండననక, వాననకా రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్న వ్యా పారుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. దశాబ్ద కాలంగా రోడ్లపైనే వ్యాపారం కొనసాగుతుండగా ఇం టిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం మొదలు కావడంతో ఆశ లు చిగురించినా అవి ఫలప్రదం కాలేదు.

వినియోగంలోకి రాక వెల్లువెత్తుతున్న విమర్శలు

-నేటికీ రోడ్లపైనే విక్రయాలు

-ఇబ్బందులు పడుతున్న కూరగాయల వ్యాపారులు

చెన్నూరు, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఎండననక, వాననకా రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్న వ్యా పారుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. దశాబ్ద కాలంగా రోడ్లపైనే వ్యాపారం కొనసాగుతుండగా ఇం టిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణం మొదలు కావడంతో ఆశ లు చిగురించినా అవి ఫలప్రదం కాలేదు. అసంపూర్తి నిర్మాణం అంతలోనే అప్పటి మంత్రిచే ప్రారంభం ఆ తర్వాత నిర్లక్ష్యం వెరసి చిరు వ్యాపారుల కష్టాలు షరా మామూలే అయ్యాయి. ఫలితంగా నేటికి రోడ్లపైనే విక్ర యాలు కొనసాగుతున్నాయి. చెన్నూరు పట్టణంలో ద శాబ్ధ కాలంగా చిరు వ్యాపారులు కూరగాయలు అమ్మే రైతులు, వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు సాగిస్తూ జీవనం గడుపుతున్నారు. అసలే ఇరుకైన రహదారులు, ఆపై రోడ్లపై అమ్మకాలు, మార్కెట్‌కు శాశ్వత నిర్మాణా లు లేని ఫలితంగా అటు రైతులు, ఇటు వ్యాపారులు, వినియోగదారులు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక, మైనిం గ్‌ శాఖ మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకుని అసంపూర్తిగా ఉన్న ఇంటిగ్రేటెడ్‌ భవ న సముదాయాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పట్టణ, మండల ప్రజలు కోరుతున్నారు.

నిర్మాణానికి నిధులు మంజూరు

నాటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో మూడు సంవ త్సరాల క్రితం ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే బాల్కక సుమన్‌ రూ. 7.2 కోట్లు మంజూరు చేయించారు. ఒకే చోట చిరు వ్యాపారంతో పాటు కూరగాయలు, మాంసం విక్రయించేందుకు ప్రణాళిక బద్దంగా అధునాతన వసతులతో కూడిన భవన నిర్మా ణాలను ప్రారంభించారు. అయితే ఈ పనులు నత్తన డకన సాగడం, సాధారణ అసెంబ్లీ ఎన్నికల గడువు స మీపిస్తుండడంతో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని అ ప్పటి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు చేతుల మీదు గా ప్రారంభోత్సవం చేయించారు. ఇక అసంపూర్తిగా మిగిలి ఉన్న భవనం మంత్రి చేతుల మీదుగా ప్రారం భమైనా తర్వాత దాని వంక అధికారులు కానీ, ప్రజాప్ర తినిధులు కానీ కన్నెత్తి చూడలేదు. నాయకుల నిర్లక్ష్యం ఫలితంగా నేటికీ భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది.

చెదిరిన ఆశలు...

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణానికి నిధులు మంజూ రై భవన నిర్మాణం ప్రారంభం కావడంతో వ్యాపారులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలు ఎంతో కాలం నిలువకపోవడం, అసంపూర్తిగా మిగిలి ఉండ డం, ఎన్నికల హడావుడిలో నాటి ప్రభుత్వం మర్చిపో వడం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించకపోవడంతో వ్యాపారులు, రైతుల ఆశలు చెదిరి పోయాయి. పట్టణ నడిఒడ్డున అసంపూర్తిగా భవనం దర్శనం ఇస్తుండగా చిరు వ్యాపారులు, రైతుల కష్టాలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. స్థానిక జగన్నాథ స్వా మి ఆలయం పరిధిలోని మార్కెట్‌ ప్రాంతంలో రోడ్లపై నే విక్రయాలు, పాత బస్టాండ్‌, కొత్త బస్టాండ్‌, గాంధీ చౌక్‌, రాజీవ్‌ రోడ్డు తదితర ప్రాంతాల్లో రోడ్డుకిరు వైపు లా కూరగాయల అమ్మకాలతో పాటు చికెన్‌, మటన్‌ సెంటర్ల నిర్వహణ కొనసాగుతోంది. ప్రస్తుత వర్షాకా లంలో రోడ్లపైనే కొనసాగుతున్న మాంసం విక్రయాల తో దోమలు విజృంభించి అంటు వ్యాధులు ప్రబలే అవ కాశం ఉంది. మంత్రి వివేక్‌వెంకటస్వామి దీనిపై దృష్టి సారించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయించి వ్యాపారులు, రైతులకు అందుబాటులోకి తెస్తే ప్రయో జనం కలుగుతుందనే అభిప్రాయాలు వెలువడుతున్నాయి.

-మొత్తంగా 108 స్టాళ్లు

సమీకృత భవనంలో మొత్తంగా 108 స్టాల్స్‌ నిర్మిం చారు. కూరగాయలు, చిరు వ్యాపారుల కోసం 70, నాన్‌వెజ్‌ కోసం 30, పూల వ్యాపారుల కోసం 8 స్టాల్స్‌ను నిర్మించారు.

ఎంతో ఆశపడ్డాం - రమేష్‌, కూరగాయల వ్యాపారి, చెన్నూరు (05సీఆర్‌పీ16)

30 ఏళ్లుగా రోడ్లపైనే కూరగాయల వ్యాపారం చేస్తు న్నాను. ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవనం మంజూరు కావ డంతో ఎంతో సంతోషపడ్డాం. కానీ అది నేటికి అసం పూర్తిగానే మిగిలి ఉండడం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికైనా ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను త్వర గా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి.

Updated Date - Jun 22 , 2025 | 11:47 PM