ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయాలి

ABN, Publish Date - Jun 23 , 2025 | 11:20 PM

జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం కోటారి గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్లను సోమవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిగా చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు

కెరమెరి మండలం కోటారిలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కెరమెరి, జూన్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లాలోని కెరమెరి మండలం కోటారి గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్లను సోమవారం గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిగా చేసే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో వినియోగించే సిమెంటు, ఇటుకలను, ఇసుక నాణ్యత పరిశీలించాలన్నారు. ఇళ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇసుకను ఉచితంగా అందిస్తుందని తెలిపారు. పనుల బిల్లులను ప్రతీ సోమవారం లబ్ధిదారుడికి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందన్నారు. బేసిమెంట్‌, రూప్‌లెవల్‌, స్లాబ్‌కు సిద్ధగా ఉన్న ఇళ్ల వివరాలను గృహ నిర్మాణ శాఖ అధికారులు ఫొటోలతో సహా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో వెంటనే నమోదు చేయాలని తెలిపారు. లబ్ధిదారుల ఖాతాల్లో సకాలంలో నిధులు జమ అయ్యే విధంగా అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. అనంతరం సావర్‌ఖేడ గ్రామంలో ప్రధాన మంత్రి శ్రీ ఇంగ్లీష్‌ మాధ్యమ పాఠశాలను సందర్శించారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యార్థులకు అందిస్తున్న బోధన తీరును పరిశీలించారు. వంద శాతం విద్యార్థులు హాజరు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా గృహ నిర్మాణ అధికార వేణుగోపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఎంపీడీఓ అంజద్‌పాషా, జిల్లా విద్యాశాఖాధికారి ఉదయ్‌బాబు, ఎంఈవో ప్రకాష్‌, ప్రధానోపాధ్యా యుడు రంగయ్య, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

రైతు భరోసాతో అన్నదాతలకు ధీమా

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): రైతు భరోసాతో అన్నదాతలకు ప్రభుత్వం ధీమా అందించిందని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. స్థానికంగా సోమవారం ఆయన మాట్లాడుతూ వానాకాలం పంట పెట్టుబడి నిధులు రైతుల ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందంగా ఉన్నారని చెప్పారు. రైతు భరోసా నిదులతో రైతులు విత్తనాలు, ఎరువులును కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం కింద జిల్లాలో సోమ వారం నాటికి 15 ఎకరాల వరకు 1,31,287 మంది రైతుల ఖాతాల్లో రూ.240,60,63,664 జమ చేసిందని తెలిపారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయం ఆవరణలో సోమవారంజిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఒలింపిక్‌ రన్‌ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని అన్నారు. క్రీడల ద్వారా క్రమ శిక్షణతో పాటు శారీకంగా, మానసికంగా ధృడంగా ఉండాలన్నారు. చదువులో ఏకాగ్రత పెంపొందుతుందని తెలిపారు. విద్యార్థులు క్రీడలను ఎంచుకుని చదువుతో పాటు రాణించాలని జిల్లాకు మంచి పేరు తీసుకు రావాలని సూచించారు. ఒలింపిక్‌ డే రన్‌ ర్యాలీ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్‌ పార్కు, కుమరం భీం చౌక్‌, అంబేద్కర్‌ చౌక్‌, బస్టాండు మీదుగా సాగింది. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా సర్వీసుల శాఖాధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, పీడీలు, పీఈటీలు, స్వచ్చంద సంస్థల సభ్యులు, విద్యార్థులు పా ల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2025 | 11:20 PM