అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Jul 18 , 2025 | 12:42 AM
అర్హులైన ప్రతి ఒక్కరికీ వి డతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు
ఎమ్మెల్యే వేముల వీరేశం
కట్టంగూరు, నకిరేకల్, చిట్యాలరూరల్, జూ లై 17(ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ వి డతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. కట్టంగూరు, నకిరేకల్, చిట్యాల మండలాలలోని పలు గ్రామాల్లో గురువారం గురువారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేసి మా ట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల లో పేదవారికి ఒక ఇళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పాలనలో అన్నివర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఇందిరమ్మ ఇళ్లు దశలవారీగా మంజూరు చే స్తామన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో ఇప్పటివరకు 3500 ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇళ్లు మం జూరైన లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని సూ చించారు. పింఛన్లకు అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త పింఛన్లను మంజూరు చేస్తుందని తెలిపారు. ధర్మారెడ్డిపల్లి కాల్వ ప నులను పూర్తిచేయించి సాగునీటిని అందిస్తానని, రైతుల ప్ర యోజనాలే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆయా కార్యక్రమాల్లో క ట్టంగూరులో కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు పెద్ది సుక్కయ్య, మాజీ జడ్పీటీసీలు సుంకరబోయిన నర్సింహ, మాద యాదగిరి, నాయకులు నంద్యాల వెంకట్‌రెడ్డి, పెద్దరాములు, జానయ్య, మిట్టపల్లి శివశంకర్, రాజు, అయితగోని నర్సింహ, అంజనకుమార్, నకిరేకల్‌లో కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన గుత్తా మం జుల మాధవరెడ్డి, పీఏసీఎస్ చైర్మన నాగులవంచ వెంకటేశ్వర్‌రావు, నాయకులు బచ్చుపల్లి గంగాధర్‌రావు, గాదగో ని కొండ య్య, యేసుపాదం, నరేందర్, అధికారులు, మాజీ ప్రజాప్రతినిఽధులు, రైతునాయకులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Jul 18 , 2025 | 12:42 AM