అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN, Publish Date - Jun 29 , 2025 | 11:30 PM
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలం దరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. నస్పూర్ పట్టణంలోని (పాత వార్డులు) 18వ వార్డు లో 24, 21 వార్డులో 39 ఇళ్లకు ఆదివారం భూమి పూజ నిర్వహించి అను మతి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావు
నస్పూర్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలం దరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు అన్నారు. నస్పూర్ పట్టణంలోని (పాత వార్డులు) 18వ వార్డు లో 24, 21 వార్డులో 39 ఇళ్లకు ఆదివారం భూమి పూజ నిర్వహించి అను మతి పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. గ త ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ కూడ ఇల్లు మంజూరు కాలేదని, కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే పథకాన్ని చేపట్టిందన్నారు. పేద ప్రజల సొంతింటి కళను నెరవేర్చాలనే ఉద్దే శ్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల నిధులను మంజూరు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కమిషనర్ శివాజీ, డిప్యూటీ తహసీల్దార్ హరిత, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్(ఆర్‌ఐ) చందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణు, 18వ వార్డు మాజీ కౌన్సి లర్ కోడూరి లహరి- విజయ్ పాల్గొన్నారు.
Updated Date - Jun 29 , 2025 | 11:31 PM