ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Khammam: బాలికపై యువకుడి అత్యాచారం

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:49 AM

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్న 11ఏళ్ల గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

  • నిందితుడిపై పోక్సో కేసు నమోదు

  • ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఘటన

కారేపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరో తరగతి చదువుతున్న 11ఏళ్ల గిరిజన బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది. శుక్రవారం సాయంత్రం కిరాణా దుకాణానికి వెళ్లిన బాలికను అదే గ్రామంలో వ్యవసాయ కూలీగా పని చేస్తున్న 27 ఏళ్ల యువకుడు భూక్య హరి వెంబడించాడు.

మార్గం మధ్యలో ఆమెను బలవంతంగా తన బైకుపై ఎక్కించుకుని గ్రామ సమీపంలోని ఓ పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక కేకలు వేయడంతో సమీప పొలం వద్ద ఉన్న ఓ రైతు గమనించి ఘటనా స్థలం వద్దకు వెళ్లేలోగా నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు కారేపల్లి ఎస్సై గోపి తెలిపారు.

Updated Date - Jun 15 , 2025 | 04:49 AM