kumaram bheem asifabad- ఆపద వేళ.. తపాలా బీమా
ABN, Publish Date - Jul 17 , 2025 | 11:22 PM
తపాలా శాఖలో తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పాలసీలు ఉన్నా యి. ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ పాలసీలు దోహదపడు తాయి. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలం గా ఉండేలా తపాలాశాఖ ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాంకిడి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): తపాలా శాఖలో తక్కువ ప్రీమియంతో ప్రమాద బీమా పాలసీలు ఉన్నా యి. ప్రమాదాలు జరిగిన సమయంలో ఈ పాలసీలు దోహదపడు తాయి. అన్ని వర్గాల ప్రజలకు అనుకూలం గా ఉండేలా తపాలాశాఖ ఆరోగ్య బీమా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. అనుకోని ఘటణ జరిగి నప్పుడు ఆసుపత్రుల్లో డబ్బులు ఖర్చుచేసి ఆర్థికంగా నష్టపోతాం, కొన్ని సార్లు పాక్షికంగా, తాత్కాలిక వైకల్యం ఏర్పడొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యక్తిగత బీమా అండగా ఉంటుంది. ఇదే క్రమంలో తపాలాశాఖ టాటా ఏఐజీతో కలిసి సామూహిక ప్రమాద బీమా (గూపు యాక్సిడెంట్ గార్డ్) పథకాన్ని ప్రవేశ పెట్టింది. ఈ పథకంలో వార్షిక ప్రీమియం రూ. 399 చెల్లిస్తే చాలు రూ. 10 లక్షల బీమా వర్తిస్తున్నది. ఇండియన్ పోస్టల్ సేమెంటు బ్యాంకు(ఐపీపీబీ) ద్వారా ప్రీమియాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
పాలసీని బట్టి..
పాలసీ, వయస్సును బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 18-65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారంతా అర్హులు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత వైకల్యం ఏర్పడినా, అవయం కోల్పోయినా, పక్షవాతం వచ్చినా రూ. 10 లక్షలు చెల్లిస్తారు. ప్రమాదం జరిగి బీమా తీసుకున్న వ్యక్తి వైద్యకోసం ఆసుపత్రిలో చేరితే ఐపీడీ)(ఇన్ పెషెంట్ డిపార్ట్‌మెంట్) కింద రూ. లక్ష క్లయిం చేస్తారు. ఆసుపత్రిలో రోజువారీ నగదుగా 10 రోజుల వరకు నిత్యం రూ. వెయ్యి చెల్లిస్తారు. విద్య ప్రయోజనానికి గరిష్ఠగా ఇద్దరు పిల్లలకు రుసుములో 10 శాతం లేదా రూ. లక్ష వరకు ఎంచుకోవచ్చు. కు టుంబ ప్రయోజనాలకు రూ. 25వేలు, అంత్యక్రియలకు రూ. 5 వేలు చెల్లిస్తారు.
తక్కువ మొత్తంతో..
- అవినాష్, తపాలాశాఖ అధికారి, వాంకిడి
తక్కువ మొత్తం చెల్లించి ఎక్కువ పరిహారం పొందే లా ప్రీమియంలు ఉన్నాయి. ఆరోగ్యరిత్యా ప్రతి ఒక్కరికీ బీమా అవసరం. భవిష్యత్తులో ఆరోగ్య విషయంమై ప్రతి ఒక్కరూ తపాలా శాఖలో బీమా చేసుకోవాలి. అను కోని ఘటన జరిగినప్పుడు తపాలా బీమా ఉపయోగ పడుతుంది. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
--------------------------------------------------
ప్రమాద బీమా ప్రీమియం వార్షిక చెల్లింపు ఇలా..
----------------------------------------------------
సంస్థ పేరు రూ. 10 లక్షలకు రూ. 15 లక్షలకు
----------------------------------------------
టాటా ఏఐజీ రూ. 699 --
ఆదిత్య బిర్లా క్యాపిట్ రూ. 549 రూ. 749
రిలయన్స్ జీఐ రూ. 550 --
నివా హెచ్‌ఐ రూ. 555 రూ. 755
బజాజ్ అలియాంజ్ రూ. 557 --
స్టార్ హెచ్‌ఐ రూ. 559 799
ఎస్‌ఎఫ్ రూ. 565 --
-------------------------------------------------
Updated Date - Jul 17 , 2025 | 11:22 PM