Weather Update: వాతావరణ శాఖ కీలక అలర్ట్.. రిపబ్లిక్ డే వరకు..
ABN, Publish Date - Jan 23 , 2025 | 05:45 PM
Weather Update: తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో.. ఉదయం పూట చలి విపరీతంగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం కాగానే ఎండలు మంట పట్టిస్తోన్నాయి. దీంతో ఓ విధమైన వాతారణం ఏర్పడింది.
తెలంగాణలో చలి పంజా విసురుతోంది. దీంతో తెల్లవారుజామున భారీగా మంచు పడుతోంది. రాత్రి వేళ.. చలి చంపేస్తోంది. అయితే తెలంగాణ వాసులకు చలి గాలుల నుంచి ఇప్పుడప్పుడే ఉపశమనం ఉండదు. అలాంటి వేళ.. భారత వాతావరణ విభాగం కీలక అప్ డేట్ ఇచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. హైదరాబాద్ నగర ప్రజలకు శీతాకాలపు చలి గాలుల నుండి ఇప్పుడప్పుడే ఉపశమనం లభించే అవకాశం లేదు. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా్లో వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ సైతం ప్రకటించింది.
ఇక ఉష్ణోగ్రతలు రాత్రి పూట 11 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్, మంచిర్యాలు, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్, ములుగు, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లా, వికారాబాద్, మేడ్చల్ - మల్కాజిగిరి, హైదరాబాద్‌తో సహా తెలంగాణలోని వివిధ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఇక రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, మహబూబాబాద్, భద్రాద్రి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు సైతం ఇదే వాతావరణం వర్తిస్తోందని స్పష్టం చేసింది. అయితే తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలో బుధవారం అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత 9.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.
మరోవైపు తెలంగాణలో ఉదయం పూట భారీగా చలి వేస్తోంటే.. మధ్యాహ్నం మాత్రం ఎండలు మాత్రం మండిపోతున్నాయి. ఇంకా ఉదాహరణగా చెప్పాలంటే.. ఉదయం పూట ఉష్ణోగ్రతలు10 డిగ్రీల లోపే ఉంటున్నాయి. కానీ మధ్యాహ్నం కాగానే ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతోంది.
Also Read: మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
Also Read: తక్కువ పెట్టుబడితో.. రోజుకు రూ.10 వేలు లాభం
మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల వరకు నమోదు అవుతోంది. హైదరాబాద్‌లో కనిష్టంగా16 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే.. గరిష్టంగా 32 డిగ్రీలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. అయితే ఈ భిన్న వాతావరణం వల్ల ప్రజలు.. సీజనల్ వ్యాధులతోపాటు ఇతర ఇబ్బందులకు గురయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
For Telangana News And Telugu News
Updated Date - Jan 23 , 2025 | 06:02 PM